Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

భారతీయ స్టేట్‌ బ్యాంకు(ఎస్‌బీఐ)కు సైబర్ సెక్యూరిటీ నుంచి పెను ముప్పు...32 లక్షల డెబిట్‌ కార్డుల భద్రత ప్రశ్నార్థకం


దేశంలోనే అతి పెద్దదైన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంకు(ఎస్‌బీఐ)కు సైబర్ సెక్యూరిటీ నుంచి పెను ముప్పు పొంచి ఉండడంతో దేశవ్యాప్తంగా లక్షలాది డెబిట్ కార్డును బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఖాతాదారులందరూ నగదు లావాదేవీలకు తప్పకుండా ఎస్‌బీఐ ఏటీఎంలనే ఉపయోగించాలని కోరింది. రద్దు చేసిన ఆరు లక్షల కార్డులను పది రోజుల వ్యవధిలో ఖాతాదారులకు అందించనున్నట్టు పేర్కొంది. ‘‘బ్లాక్ చేసిన కార్డులను ఖాతాదారులకు తిరిగి అందించేందుకు ఏడు నుంచి పది రోజుల వ్యవధి పెట్టుకున్నాం’’ అని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్(కోల్‌కతా సర్కిల్) పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా తెలిపారు. సేఫ్ ట్రాన్సాక్షన్ల కోసం అందరూ ఎస్‌బీఐ ఏటీఎంలనే ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. 

No comments:

Post a Comment