Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

మీకు పెళ్లయిందా..? అయితే వెంటనే వెళ్లి రిజిస్ర్టేషన్‌ చేయించుకోండి

వివిధ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వివాహ నమోదు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కులం, మతం, ఆచార సాంప్రదాయాలకు అతీతంగా ఈ చట్టాన్ని చేసింది. ఈ నేపద్యంలో వివాహ నమోదు ఎలా...? రిజిస్ర్టేషన్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి తెలుసులుకుందాం . 

2008లో ప్రత్యేక చట్టం :
1872 నాటి వివాహ చట్టాన్ని మారుస్తూ 1954లో కేంద్ర ప్రభుత్వం నూతన విధా నాన్ని రూపొందించింది. 1969లో మరోసారి దాన్ని సవరిస్తూ జనన, మరణాలతో పాటు వివాహాల నమోదు తప్పనిసరి అని నిర్ణయించింది. 2006 ఫిబ్రవరి 14న దేశ సర్వోన్నత న్యాయస్ధానం వివాహాల నమో దు తప్పనిసరి చేయాలని ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా 2008లో కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చింది. ఈ చట్ట సవరణ బిల్లును గతేడాది పార్లమెంట్‌లో ఆమోదించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం వరుడికి 21, వధువుకు 18 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలి. పెళ్లి జరిగిన 20 రోజుల్లో వివాహ నమోదు చేసుకోవచ్చు.

నమోదు సులువే :
సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యాల్లో వివాహ నమోదు ఎప్పటి నుంచో ఉంది. పుర పాలక సంఘాల్లోనూ వివాహ నమోదుకు ప్రత్యేక సిబ్బంది ఉన్నారు. గ్రామ పంచాయతీ ల్లోనూ నమోదు చేసుకోవచ్చు. ముందు గానే వివాహ సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శికి అందచేస్తే నిర్ణీత రుసుం తీసు కుని దరఖాస్తు అందచేస్తారు. ముగ్గురు సాక్షుల సంతకాలతో పంచాయతీ కార్యదర్శి, పురపాలక సంఘంలో ప్రత్యేక ఉద్యోగి వివాహ ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తారు.

ఇవి ఉండాలి :
పదోతరగతి మార్కుల జాబితా (చదు వుకున్న వారైతే), నివాస ధ్రువీకరణ, రేషన్‌ కార్డు, ఓటరుకార్డు, ఆఽధార్‌కార్డుల్లో ఏదో ఒకటి ఉండాలి. తాళికట్టిన, జీలకర్ర-బెల్లం పెట్టిన ఫొటోతో పాటు వివాహానికి హాజరైన వారితో కలిసి దిగిన ఫొటోలుండాలి. ఆల యంలో వివాహం చేసుకుంటే ఆలయ బాధ్యులు ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. రెండు వేర్వేరు కులాలు, మతాలవారు వివాహం చేసుకుంటే ముందుగానే సబ్‌ రిజిస్ర్టార్‌కు సమాచారం ఇవ్వాలి. దీంతో పాటు ఫొటోలు, సమాచారం, ముగ్గురు సాక్షుల సంతకాలు ఇవ్వాలి.

ప్రయోజనాలు :
ఈ చట్టంతో మత ప్రసక్తిలేని వివాహాలు చేసేందుకు మార్గం సులువు అవుతుంది. వివిధ పథకాలు పొందేందుకు దోహదం చేస్తుంది. వివాహం నమోదు చేసుకున్న మహిళలకు ఏమైనా సమస్యలు వస్తే సులు వుగా పరిష్కరించుకోవచ్చు. విడాకులు, భర ణం, పిల్లల రక్షణ, ఆస్తుల వివాదా ల్లోనూ వివాహ ధ్రువీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకుంటారు. రెండో వివాహాన్ని అడ్డుకు నేందుకు ఇది ఉపయోగప డుతుంది. ప్రేమ పేరుతో మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. వరకట్న వేధింపులు, శారీరక, మానసిక వేధింపులకు గురిచేసే భర్తలు, వారి కుటు ంబ సభ్యులపైనా ఫిర్యాదుకు ఉపయోగ పడుతుంది. పాస్‌ పోర్టు పొందేందుకు ఉపకరిస్తుంది. వివాహ ధ్రువీ కరణ పత్రం మనదేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగ పడుతుంది.

No comments:

Post a Comment