ప్రభాస్‌కు మరో మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది
తెలుగు సినీ రికార్డులను తిరగరాసిన సినిమా బాహుబలి. ఇప్పట్లో మళ్లీ ఏ సినిమా కూడా తన దరిదాపుల్లోకి రాలేనంతగా ప్రభంజనం సృష్టించిన సినిమా అది. తొలిసారిగా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సినిమా అది. సినిమాతో పాటే అటు రాజమౌళి, ఇటు ప్రభాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు కూడా బాహుబలి ఎంపికైంది. దాంతో పాటే ప్రభాస్‌కు మరో మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది తన మైనపు విగ్రహం.
ప్రపంచంలోని ప్రముఖులకు మైనపు రూపాన్నిచ్చి దాచే ప్రఖ్యాత మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్.. ప్రభాస్‌కూ ఆ అరుదైన గౌరవాన్ని అందించింది. ఇటీవలే మ్యూజియం ప్రతినిధులొచ్చి ప్రభాస్ కొలతలు తీసుకుని వెళ్లారు. దీనిపై తెలుగు సినీ అభిమానులు చాలా ఆనందంగానే ఉన్నా.. కొందరు మాత్రం విషాన్ని వెదజల్లుతున్నారు. తమకు రాలేదన్న అక్కసుతో ప్రభాస్‌పై ఏడుస్తోంది తమిళ మీడియా. తాజాగా ప్రముఖ తమిళ పత్రిక ఒకటి ప్రభాస్ మైనపు విగ్రహంపై తమిళ సెలెబ్రిటీల అభిప్రాయాలను ప్రచురించింది. అంతేకాదు.. ప్రభాస్‌కు మైనపు విగ్రహమా? అంటూ అక్కసు వెళ్లగక్కింది. ‘‘ప్రభాస్‌కే మైనపు విగ్రహం పెడితే.. మరి రజనీకాంత్, కమల్‌హాసన్‌ల విగ్రహాలను ఎందుకు పెట్టకూడదు?’’ అంటూ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ వార్త ప్రచురించింది. ఇక, కొంత మంది సెలెబ్రిటీలు శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్‌ల మైనపు విగ్రహాలనూ పెట్టాలని అభిప్రాయపడ్డారు. మరి, ఈ ఈర్ష్య వారికి తగునా?
Labels:
Telugu Movie
No comments:
Post a Comment