రాజసంగా సింహాసనాన్ని అధిష్ఠించిన ధీరుడు గౌతమిపుత్ర శాతకర్ణి

రాజసంగా సింహాసనాన్ని అధిష్ఠించిన ధీరుడు గౌతమిపుత్ర శాతకర్ణి అతడు. అవును నందమూరి అభిమానులకు దసరా పండుగ ఇంకా రెండు రోజులున్నా ముందే పండుగ తెచ్చేశాడు డైరెక్టర్ క్రిష్. 
Telugu-Movies-Images-Vedios-Free-Wallpapers-Pictures-Tollywood-News-Information

శాతకర్ణి బాలయ్యబాబు మరో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఫేస్‌బుక్ పేజీలో పెట్టాడు. శాతకర్ణిగా బాలయ్యబాబును క్రిష్ మంచి రాయల్ లుక్‌లో బాగానే ప్రెజెంట్ చేశాడు ఈ జాతీయ అవార్డు గ్రహీత. దసరా పండుగ రోజు వరకు అభిమానులకు ఇక పండుగే. దసరా రోజు మరో శుభవార్తను చూపించబోతున్నాడు క్రిష్. మంగళవారం ఉదయం 10.15 గంటలకు శాతకర్ణి టీజర్‌ను విడుదల చేయబోతున్నాడాయన. మరి, టీజర్‌లో బాలయ్య ఎంతలా అలరిస్తాడో? సినిమాలో ఇంకెంత ధీరోదాత్తను చూపిస్తాడో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment