Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

మొబైల్‌ ఫోన్‌ను అతి జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ...ఉంది


జీవితంతో పెనవేసుకు పోయిన మొబైల్‌ ఫోన్‌ను అతి జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉందంటున్నారు ఎటిక్యుట్‌ నిపుణులు సమీర, నమ్రత. మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఫోన్‌ ఎలా ఉపయోగించినా కాన్ఫరెన్స్‌లకు హాజరైనప్పుడు, ఆఫీస్‌లో ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వినియోగించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు.  


నిజానికి మొబైల్‌ను సైలెంట్‌లో ఉంచాల్సింది సమావేశాల్లో మాత్రమే కాదు ఆఫీస్‌లో లేదంటే ఎవరితో అయినా ఓ అంశం గురించి మాట్లాడుతున్న సందర్భంలో అయినా సరే సైలెంట్‌లో పెట్టాలి. మొబైల్‌ రింగింగ్‌ వర్క్‌ ప్లేస్‌లో అసహనాన్ని సృష్టిస్తుంది. ఓ సీరియస్‌ డిష్కషన్‌ బాస్‌తో జరుగుతున్నప్పుడు చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ ఫోన్‌ రింగ్‌ అయితే ఎలా ఉంటుంది ? ఒకవేళ మీరు ఆ కాల్‌కు ఆన్సర్‌చేయాల్సి వస్తే మరలా చేస్తానని చెప్పి కట్‌ చేయండి. లేదంటే అప్పుడైనా సరే సైలెంట్‌లో పెట్టండి.


మూవీ రింగ్‌ టోన్స్‌ :
మీకు ఎంత ఇష్టమైన సినిమా పాట అయినా సరే మొబైల్‌ రింగ్‌ టోన్‌గా పెట్టుకోకపోవడమే మంచిది. మీరున్న సందర్భానికి సూట్‌ కాని పాటలు ఒక్కోసారి ఉండవచ్చు. అందరూ బాధలో ఉన్న చోటకు వెళ్లినప్పుడు.. మీ ఫోన్‌లో ఈ జీవన చదరంగంలో.. అనో లేకపోతే నవ్వవయ్యా బాబూ.. నీ సొమ్మేం పోయింది అంటూ ఫోన్‌ రింగ్‌ అయితే అవతలి వాళ్లకు ఎలా ఉంటుందో తెలిసిందేగా..! కేవలం పాటగానో కాదు.. అసలు మీ రింగ్‌టోన్‌ మీరు ఎలాంటి మనస్తత్వంకలవారో కూడా చెప్పేస్తుంది. కాబట్టి వీటిని ఎంచుకునేటప్పుడ్పు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

ప్రామిస్‌ మీన్స్‌ :
మీరు మీటింగ్‌లో ఉన్నప్పుడు తరువాత చేస్తామని మెసేజ్‌ పెట్టి వదిలేశారంటే అది మీ విశ్వసనీయతకే దెబ్బ. మరీ ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి..! ప్రామిస్‌ మీన్స్‌ ప్రామిస్‌.. దానిని అతిక్రమించడం చేయకూడదు. కాల్‌ బ్యాక్‌ ఆఫ్టర్‌ 15 మినిట్స్‌ అని మెసేజ్‌ పెడితే 15 నిమిషాల తరువాత అవతలి వ్యక్తికు ఫోన్‌ చేయాలి. కుదరని పక్షంలో అరగంట తరువాత అయినా ఫోన్‌ చేసి ముందుగా అవతలి వ్యక్తికు క్షమాపణ చెప్పి మీ సంబాషణ కంటిన్యూ చేయాలి.

మాట్లాడే ముందు :
మీకు బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్లు లేదంటే బంధువులు అయితే ఫర్వాలేదు కానీ తెలియని అంతగా పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడేముందు.. అవతలి వ్యక్తితో మీరుమాట్లాడటానికి సరి అయిన సమయమేనా అని అడగాలి. అవతలి వ్యక్తి కొనసాగించమన్నప్పుడు మాత్రమే సంబాషణ కొనసాగించాలి. ఒకవేళ అతను తరువాత ఫోన్‌ చేయమంటే.. ఎంతసేపు తరువాత చేయమంటారని గౌరవంగా అడగడంలో తప్పులేదు.

తెలియని వ్యక్తులకు మెసేజ్‌ పంపేటప్పుడు..తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు పంపేటప్పుడు మీ పేరు, వీలైతే మీ వృత్తి చెప్పడం వల్ల అవతలి వ్యక్తి గర్తు పట్టవచ్చు. మీరు ఒకసారి మాట్లాడినవెంటనే మీ నెంబర్‌ వారు నోట్‌ చేసుకుంటారని ఎప్పుడూ అనుకోవద్దు.


ఫోన్‌లో అరవకూడదు :
దూరంలోని వ్యక్తులతో మాట్లాడటానికే ఫోన్‌ ఉన్నది. మీరు ఫోన్‌లో అరవడం వల్ల పక్కన ఉన్న వాళ్లకు ఇబ్బంది.. అవతలి వ్యక్తికు చెవిపోటు.. మీకు ఆయాసం తప్ప ఒనగూరే ప్రయోజనం ఉండదు. మీరు ఎంత నెమ్మదిగా మాట్లాడినా రిసీవ్‌ చేసుకోవడానికి ఇప్పుడు ఫోన్లలో సౌకర్యం ఉంది.

మీతో ఒకరు ఉన్నప్పుడు :
అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీరు ఇతరులతో సమావేశంలో ఉన్నప్పుడు ఫోన్‌ చేయడం లేదంటే కాల్‌ అందుకోవడం చేయకూడదు. అలాగే మీ సంబాషణలను ఆ ఫోన్‌ కాల్‌తో మిక్స్‌ చేయకూడదు. అవతలి ఫోన్‌ ఎత్తకపోతే పదే పదే వేధించవద్దు.అవతలి వ్యక్తి ఒకసారి మీరు ఫోన్‌ చేసినప్పుడు కట్‌ చేసినా లేదంటే ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోయినా పదే పదే చేయడం మంచి పద్ధతి కాదు. కట్‌ చేశాడంటే అతను మాట్లాడే పరిస్థితిలో లేడని అర్థం చేసుకోవాలి. అతను ఖాళీ కాగానే ఫోన్‌ చేయమని ఓ సందేశం పెడితే చాలు. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం కుదరని గ్రహించాలి. ఇక కొంతమంది కావాలనే ఫోన్‌ ఎత్తరు. అలాంటి వారిని మరో రకంగా మీరు హ్యాండిల్‌ చేయాలి తప్ప పదే పదే ఫోన్‌ చేస్తుండటం వల్ల మీరు అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది.

వ్యక్తిగత కాల్స్‌కు ఆఫీస్‌లో :
వ్యక్తిగత కాల్స్‌ను ఆఫీస్‌ టైమ్‌లో చేయకపోవడమే మంచిది. అవి మీ మీద బ్యాడ్‌ ఇంప్రెషన్‌ను బాస్‌కు కలిగించే ఆస్కారం కలిగిస్తాయి. ఒకవేళ తప్పనిసరి అయితే ఎక్స్‌క్లూజ్‌మీ అంటూ బయటకు వచ్చి మాట్లాడి సమయం వృథా చేయకుండా మీ రొటిన్‌ వర్క్‌లో చేరిపోవడం మంచిది. సమావేశాల్లో పాల్గొన్నప్పుడు విషయం మీద శ్రద్ధ వహించాలి తప్ప వాట్సాప్‌, మెసేజింగ్‌ చేయడం లేదంటే సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ చేయడం అనేవి చెడ్డ అలవాట్లను సూచిస్తాయి.

No comments:

Post a Comment