Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఆపిల్‌ కంటే జామ పండులో ఎక్కువ పోషక విలువలు.....

జామపండును చూస్తే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. పిల్లల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇళ్ల పెరట్లో ఉండే పండ్ల చెట్లలో జామకే మొదటి ప్రాధాన్యం. ఆరోగ్యంలోనూ జామపండుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు వైద్యులు. వీటి ధర తక్కువ, రుచి పోషకాలూ ఎక్కువ. 

ఆపిల్‌ కంటే జామ పండులో ఎక్కువ పోషక విలువలుంటాయి. ఆపిల్‌ పండ్లు పేదవాళ్లు కొనే పరిస్థితి లేకపోవడం, ఆ స్థాయి కంటే ఎక్కువ పోషక విలువలు జామ పండులో లభిస్తుండడంతో దీనిని పేదవారి ఆపిల్‌గా న్యూట్రిషన్లు పిలుస్తున్నారు. సీజనలో లభించే జామ పండులోని పోషక విలువలు మరే ఇతర పండులో లభించవని హైదరాబాదులోని నేషనల్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రతినిధులు పరిశోధనల్లో తేల్చారని న్యూట్రీషన్లు, వైద్యులు అంటున్నారు. జామ పండులోనే కాదు జామ ఆకుల్లో సైతం బోలెడన్ని పోషకాలున్నాయి. జామ ఆకులతో ఎన్నో రకాల మందులు కూడా తయారవుతాయని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జామ పండు జ్యూస్‌కు కూడా గిరాకీ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. జామ పండులో లభించే విటమిన్లు, పోషకాలు, వాటిని తినటం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం.


జామ పండుతో లభించే విటమిన్లు  :
జామపండులో అత్యధికంగా విటమిన్‌ సి, పోటాషియం ఉంటాయి. వీటిద్వారా యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తగినంత లభిస్తాయి. వీటిని తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మనిషి ఉల్లాసంగా ఉంటారు. విటమిన్‌ సి ఉసిరితో సమానంగా, కమలా కన్నా 5 రెట్లు, నిమ్మ, నారింజ పండుల్లో కంటే 10 రెట్లు అధికంగా జామలో లభిస్తాయి. జామ పండును తొక్కతో పాటు తినటం వల్ల ఇందులోని పీచు పదార్థం శరీరానికి మంచి చేస్తుంది.

చర్మ సౌందర్యంలో :
చర్మసౌందర్యంలో జామపండు గుజ్జు అధిక ప్రాధాన్యం సంతరించుకుందని బ్యూటీషియన్లు అంటున్నారు. బొప్పాయి, టమోటా కంటే జామపండు గుజ్జుతో ఫేషియల్‌ చేసుకునేందుకు ఎక్కువమంది మహిళలు ఆసక్తి చూపుతునట్లు తెలిపారు. చర్మ సౌందర్యాన్ని పెంచటంతో పాటు నల్లటి మచ్చలను తొలగించే పోషకాలు జామ పండులో ఉన్నాయి.


ఆయుర్వేద వైద్యంలో జామ ఆకుల పాత్ర :
జామ ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా వాడుతున్నారు. ప్రధానంగా తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి, పంటినొప్పితో తరచు బాధపడుతున్న వారికి ఉపయోగించే ఆయుర్వేద మందుల్లో జామ ఆకుల పాత్ర కీలకం. జామ ఆకులను నీటితో శుభ్రం చేసి బాగా ఎండబెట్టిన తరువాత పొడిచేసుకుని మజ్జిగ, తేనెలో కలుపుకుని తినటం వల్ల సైనస్‌, మైగ్రేన్‌ (తలనొప్పి) తగ్గుతాయి.

పొట్టవద్ద పేరుకున్న కొవ్వును కరిగించే శక్తి జామ ఆకులకు ఉంది. జామ బెరడు బాగా శుభ్రం చేసి నీటిలో మరిగించి వడకట్టుకుని రెండు పుదీన ఆకులను అందులో వేసుకుని రోజూ ఉదయం టీ, కాఫీలకు బదులుగా తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి రక్తం శుద్ధి చేస్తుంది. పళ్ల సమస్యలుండేవారు రోజూ రెండు లేత జామ ఆకులు నమిలి మింగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే జామ ఆకులు, పండ్లు తినడానికి ముందు వాటిని నీటితో బాగా శుభ్రం చేయాలని లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

No comments:

Post a Comment