నూతనంగా ప్రారంభిస్తున్న బ్యాంకుల్లో.... పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపిపిబి)- నూతనంగా ప్రారంభిస్తున్న బ్యాంకుల్లో స్కేల్ - 1, స్కేల్ - 2, స్కేల్ - 3 ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 650 శాఖలకు గాను దేశవ్యాప్తంగా 3,500 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అయితే ఎంపిక ప్రక్రియ ఐబిపిఎస్ మాదిరిగానే ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆఫీసర్ గ్రేడ్ - I
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్(టెరిటరీ) (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ - I)
ఖాళీలు: 650
ఇందులో జనరల్ అభ్యర్థులకు 327 పోస్టులు కేటాయించారు.
అర్హత: సెప్టెంబరు 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తుకు అనర్హులు. పోస్టల్ సర్వీసుల్లో పనిచేస్తున్నవారు, సేల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్/ రూరల్ బ్యాంకింగ్ విభాగాల్లో పనిచేస్తున్నవారు, బ్యాంకుల్లో బిజినెస్ కరెస్పాండెంట్‌గా అనుభవం ఉన్నవారు కూడా అర్హులే.
వయసు: సెప్టెంబరు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ :
1. అభ్యర్థులను ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
2. అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. ఈ సమయంలో ఇంటెన్సివ్ ట్రైనింగ్‌కు హాజరు కావాలి.
ప్రిలిమినరీ ఎగ్జామ్:
గంటసేపు జరిగే ఈ ఎగ్జామ్‌కు 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి ప్రతి విభాగంలో క్వాలిఫై కావాలి. ఐపిపిబి నిర్ణయం మేర కటాఫ్ మార్కులు సాధించిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్‌కు పంపుతారు.
మెయిన్ ఎగ్జామ్:
ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి నిర్ణీత సమయాన్ని, మార్కులను కేటాయిం చారు. మొత్తమ్మీద 140 నిమిషాల సమయం ఇస్తారు. ఈ ఎగ్జామ్‌కు కేటాయించిన మార్కులు 200. రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 40 నిమిషాలను, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 40 ప్రశ్నలకు 30 నిమిషాలను, కంప్యూటర్ నాలెడ్జ్‌లో 20 ప్రశ్నలకు 10 నిమిషాలను, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్)లో 40 ప్రశ్నలకు 20 నిమిషాలను, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 40 నిమిషాలను ఇస్తారు. ఈ మెయిన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. ప్రిలిమినరీ , మెయిన్ ఎగ్జామ్స్‌లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు పెనాల్టీ ఉంటుంది. సమాధానం గుర్తించని పక్షంలో పెనాల్టీ ఉండదు.
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ.700(ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్యుడి అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కింద రూ.150 చెల్లిస్తే సరిపోతుంది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 25
కాల్ లెటర్స్ డౌన్‌లోడింగ్: ఆన్‌లైన్ ఎగ్జామ్‌కు వారం ముందు
ఆన్‌లైన్ ఎగ్జామ్: 2016 డిసెంబరు, 2017 జనవరిలో
ఆఫీసర్ గ్రేడ్ - II
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్(టెరిటరీ)(మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ - II)
ఖాళీలు: 652
విభాగాలవారీ ఖాళీలు: ఏరియా సేల్స్ 250, ఏరియా ఆపరేషన్స్ 350, ప్రోడక్ట్ రీసెర్చ్ 1, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ 2, యూజర్ ఇంటర్‌ఫేస్ 2, అకౌంట్ పేబుల్ 1, ట్యాక్సేషన్ 1, ప్రొక్యూర్‌మెంట్ 1, ట్రెజరీ సెటిల్‌మెంట్స్ & రీకన్సిలేషన్ 1, ట్రైనింగ్ 1, హెచ్‌ఆర్ జనరలిస్ట్ మ్యాన్ పవర్ ప్లానింగ్ & రిక్రూట్‌మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2, కార్పొరేట్ హెచ్‌ఆర్ ్క్ష అడ్మినిస్ట్రేషన్ 1, బ్రాంచ్ హెచ్‌ఆర్‌్క్ష అడ్మిని స్ట్రేషన్ 4, అడ్మినిస్ట్రేషన్ 1, హిందీ సెల్ 1, రిస్క్ & కంకరెంట్ ఆడిట్ 2, కస్టమర్ అక్విజిషన్ సపోర్ట్ 16, వెండర్ పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ 3, కంప్లయెన్స్ సపోర్ట్ & రిపోర్టింగ్ 2, ఆపరేష నల్ రిస్క్ 6, లీగల్ 1, వెండర్ మేనేజ్‌మెంట్ - హార్డ్‌వేర్/ సాఫ్ట్‌వేర్ / సర్వీసెస్ 2, డిజిటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ 1 జనరల్ అభ్యర్థులకోసం 326 పోస్టులను కేటాయించారు.
అర్హత: సెప్టెంబరు 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
ఆయా విభాగాలను అనుసరించి ఉండాల్సిన ఇతర అర్హతలు, అనుభవం తదితర వివరాలకోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
వయసు: సెప్టెంబరు 1 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్ గ్రేడ్ - III
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్(టెరిటరీ)(మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ - III)
ఖాళీలు: 408
విభాగాలవారీ ఖాళీలు: బ్రాంచ్ 350, సేల్స్ ఆపరేషన్స్ 2, యుఐ/ యుఎక్స్ 1, రిటైల్ ప్రోడక్ట్స్ 3, మర్చంట్ ప్రోడక్ట్స్ 2, గవర్నమెంట్ ప్రోడక్ట్స్ 2, డిజిటల్ మార్కెటింగ్ 1, బ్రాండింగ్ & మార్కెటింగ్ 1, ఫైనాన్షియల్ ప్లానింగ్ & బడ్జెటింగ్ 1, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ 1, ట్రైనింగ్ 1, హెచ్‌ఆర్ జనరలిస్ట్ మ్యాన్ పవర్ ప్లానింగ్ & రిక్రూట్‌మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2, రిస్క్ & కంకరెంట్ ఆడిట్ 2, ఫ్రాడ్ కంట్రోల్ ఆపరేషన్స్ 4, కస్టమర్ సర్వీస్ 4, కాల్ సెంటర్ 1, బ్రాంచ్ ఆపరేషన్స్ 4, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ 3, రికన్సిలేషన్ 3, కంప్లియెన్స్ సపోర్ట్ & రిపోర్టింగ్ 2, సిస్టమ్/ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ 5, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ 5, నెట్‌వర్క్/ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ 5, ఐటి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ 3
జనరల్ అభ్యర్థులకు 204 పోస్టులు కేటాయించారు.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఖరు ఏడాది పరీక్షలు రాస్తున్నవారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నవారు దరఖాస్తుకు అనర్హులు.
అనుభవం: ఆయా విభాగాల్లో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: సెప్టెంబరు 1 నాటికి 26 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700 (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.150 మాత్రమే)
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 7 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 1
దరఖాస్తు విధానానికి సంబంధించిన గైడ్‌లైన్స్ కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
ఇవి కాక స్కేల్-IV నుంచి స్కేల్-VI కేటగిరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం కూడా విడిగా ఒక ప్రకటనను విడుదల చేశారు.
పోస్టులు: చీఫ్ మేనేజర్, ఎజిఎం, డిజిఎం
విభాగాలు: ఆపరేషన్స్, హెచ్‌ఆర్, అడ్మినిస్ట్రేషన్, టెక్నాలజీ, రిస్క్ & కంప్లయెన్స్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీస్, ప్రోడక్ట్, మార్కెటింగ్ & ఫైనాన్స్ ఫంక్షన్స్.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
నిర్దేశించిన అర్హతల తోపాటు 9/ 12/ 15 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 25
వెబ్‌సైట్: www.indiapost.gov.in
Labels:
Job Notification
No comments:
Post a Comment