నిద్ర లేవగానే....మంచినీరు తాగడం ప్రారంభించండి
పరగడుపున నీరు తాగడం వల్ల ఎంతో ప్రయోజనం. ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అనారోగ్యాన్ని దూరం చేస్తుందని పేర్కొంటు న్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటర్ల మంచినీటిని తాగాలని, తరువాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం మంచినీరు తాగడం ప్రారంభించండి.
ప్రయోజనం ఇలా :
1. పరగడుపున మంచినీరు తాగడం వల్ల పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కాలకృత్యాలు సక్రమంగా జరుగుతాయి.
2. కొత్తరక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచుతుంది.
3. పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా శరీర బరువు తగ్గడానికి ఉప యోగ పడుతుంది.
4. రక్తకణాలను శుద్ధి చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగుతాయి. దీంతో శరీర ఛాయ ప్రకాశి స్తుంది.
5. స్వేతధాతువులను సమతుల్యం చేస్తుంది.
6. ఈ గ్రంథుల వల్ల రోజువారీ కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా శరీరం పనిచేస్తుంది.
7. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
ఖాళీ కడుపుతో ఇవి తీసుకోవద్దు :
1. ఖాళీ కడుపుతో కొన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.
2. స్పైసీ ఫుడ్ తింటే అల్సర్స్ వస్తాయి.
3. మెడిసిన్ తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ రావచ్చు.
4. కాఫీ తాగితే హార్మోన్లు అసమతుల్యత, ఒత్తిడి వస్తుంది. ఫ టమాటా తింటే యాసిడ్స్ కారణంగా సమస్యలు.
5. సోడా, కూల్‌డ్రింక్స్ తాగితే వాంతులు, పేగుల్లో ఇరిటేషన్.
6. అరటిపల్లతో మెగ్నీషియం లెవల్స్ పెరుగుతాయి.
Labels:
Health Tips
No comments:
Post a Comment