మొబైల్ ఏది తీసుకున్నా.... క్వాలిటీ ముఖ్యం
మల్టీకోర్ ప్రాసెసర్‌తో వేగం :
కొత్త మోడల్‌ను రిలీజ్ చేస్తున్నప్పుడు మొబైల్ తయారీ కంపెనీలు రకరకాల ప్రచారాలు చేస్తుంటాయి. అందులో ఇదొకటి. మల్టీకోర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్‌కు వేగం ఎక్కువ ఉంటుందని చెబుతుంటాయి. కానీ నిజం వేరు. మా మొబైల్‌లో అక్టాకోర్ ప్రాసెసర్ ఉపయోగించామని ఏదైనా కంపెనీ అడ్వటైజ్ చేస్తుందంటే అది ప్రచారవ్యూహంగానే భావించాలి. ఐఫోన్ 6ఎస్‌లో టూ-కోరో ప్రాసెసరే ఉంటుంది. మార్కెట్లో లభించే 8-కోర్ ప్రాసెసర్ మొబైల్ ఏది తీసుకున్నా ఐఫోన్ 6ఎస్ వేగాన్ని అందుకోవు. కారణమేమిటంటే కోర్‌లో ఉండే నాణ్యత. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. అంతేకాకుండా పర్‌ఫార్మెన్స్ అనేది సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 20 కోర్ ప్రాసెసర్ ఉపయోగించినా దాన్ని సాఫ్ట్‌వేర్ ఉపయోగించుకోలేకపోతే అది యూజ్‌లె్‌సగానే మిగిలిపోతుంది. ఫోన్ స్పీడ్ ఒక్క కోర్ సంఖ్య మీదే ఆధారపడదు. ఇతర చాలా అంశాలు మిళితమై ఉంటాయి.
యాంటీ వైరస్ యాప్స్ :
ఆండ్రాయిడ్ తయారీదారైన గూగుల్‌కి యాంటీవైరస్ యాప్స్‌పై ఏ మాత్రం నమ్మకం లేదు. ‘‘ఆండ్రాయిడ్‌కు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పనసరి అనడాన్ని మేం విశ్వసించం’’ అని కంపెనీయే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను 80 శాతం మంది ఉపయోగిస్తున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ కోసం సాండ్-బాక్సింగ్‌ను ఉపయోగిస్తోంది. టైమ్ టు టైమ్ ఫోన్‌ను స్కాన్ చేయడం ద్వారా తగిన భద్రతను వినియోగదారులకు అందిస్తోంది. నిజానికి యాంటీవైరస్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫోన్ వేగం తగ్గిపోతుంది. ఒకవేళ మీ ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్ ఉంటే కనుక అన్‌ఇన్‌స్టాల్ చేసి చూడండి ఫోన్ వేగం ఎంత పెరుగుతుందో.
కెమెరా మెగాపిక్సెల్స్ :
ఫోన్ కంపెనీలు ప్రచారం చేసిన మరొక మిత ఇది. ప్రస్తుతం అన్ని స్మార్ట్‌ఫోన్లలో మంచి కెమెరాలున్నాయి. ఐఫోన్ 7, గెలాక్సీ ఎస్7, నెక్సస్ 6పి, హెచ్‌టిసి 10లలో 12 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సర్ కెమెరాలున్నాయి. ఏదైనా కంపెనీ 21 మెగాపిక్సెల్ ఇమేజ్ ఉన్న ఫోన్‌ను రిలీజ్ చేస్తున్నామని చెబితే అది అబద్దంగానే భావించాలి. నాణ్యమైన కెమెరాల్లో పెద్ద ఇమేజ్ సెన్సర్లుంటాయి. మెగాపిక్సెల్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
ర్యామ్ స్పీడ్ :
3 జిబి ర్యామ్ అయితే ఎక్కువ స్పీడ్ ఉంటుందని అనుకోవడం పొరపాటే. ర్యామ్‌ను ఉపయోగించుకునే విధానం, ర్యామ్ స్పీడ్ చాలా ముఖ్యం. ఉదాహరణకు ఐఫోన్ తీసుకుంటే 1జిబి లేక 2జిబి ర్యామ్ ఉన్నా అద్భుతంగా పనిచేస్తుంది. అత్యంత వేగవంతంగా పనిచేస్తుందన్న పేరున్న నెక్సస్ 5లోనూ 2 జిబి ర్యామ్ ఉంది. కాబట్టి ఫోన్ పర్‌ఫార్మెన్స్ ఒక్క ర్యామ్‌పైనే ఉండదు.
హై రెజల్యూషన్ స్ర్కీన్ :
ఇది కూడా ఫోన్ తయారీ కంపెనీలు చేస్తున్న ప్రచారంలో భాగమే. 5 అంగుళాల స్ర్కీన్ ఉన్న ఫోన్ రెజల్యూషన్ 1440పి ఉంటుంది. ఒకవేళ ఇదే 5 అంగుళాల స్ర్కీన్ ఉన్న ఫోన్‌లో ఎక్కువ పిక్సెల్ ఉన్నాయని అన్నారంటే అంది 32 అంగుళాల టెలివిజన్‌తో సమానం. సూపర్ హై రెజల్యూషన్ అనేది ఎప్పుడూ పట్టించుకోకూడదు. స్ర్కీన్ క్వాలిటీ, కలర్స్, బ్రైట్‌నెస్ వీటి గురించే చూడాలి.
Labels:
General Info
No comments:
Post a Comment