ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం ...ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తులు కోరు తోంది
ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్- ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరు తోంది.
మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. జనరల్ అభ్య ర్థులకు 158, ఎస్సీలకు 43, ఎస్టీలకు 15, ఒబిసిలకు 84 పోస్టులను కేటాయించారు.
అర్హత: అక్టోబరు 1 నాటికి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ కానీ, పీజీ కాని పూర్తిచేసి ఉండాలి.
వయసు: అక్టోబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ & ఎస్టీలకు అయిదేళ్లు, ఒబిసి అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
జిఐసి, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ తదితర పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు ఎనిమిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఫేజ్ - 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ :
ఈ పరీక్షలో అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. గంట వ్యవధిగల ఈ పరీక్షకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు సంబంధించి 30 ప్రశ్నలు ఇస్తారు. రెండో సెక్షన్‌లో రీజనింగ్ ఎబిలిటీ, మూడో సెక్షన్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి ఒక్కోదానిలో 35 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా మిగిలిన రెంటికీ ఇంగ్లీష్/ హిందీ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. ప్రతీ సెక్షన్‌లో అభ్యర్థి అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత మార్కు లను కంపెనీ నిర్ణయిస్తుంది. ఖాళీలకు 15 రెట్ల సంఖ్య లో అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఫేజ్ - 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ - 2 మెయిన్ ఎగ్జామ్ , ఫేజ్ - 3 ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫేజ్ - 2 మెయిన్ ఎగ్జామ్ :
మెయిన్ ఎగ్జామ్‌లో ఆబ్జెక్టివ్ టెస్ట్స్, డిస్ర్కిప్టివ్ టెస్ట్స్ కలిసి ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్స్‌కు రెండు గంటల సమయాన్ని, 200 మార్కులను కేటాయించారు. రీజ నింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటి టేటివ్ ఆప్టిట్యూడ్ టెస్టుల్లో ఒక్కోదాని నుంచి 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా మిగిలిన రెంటికీ ఇంగ్లీష్/ హిందీ మాధ్య మాన్ని ఎంచుకోవచ్చు. డిస్ర్కిప్టివ్ టెస్ట్‌కు 30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమ యం అర్థగంట. ఇంగ్లీష్ లాంగ్వే జ్‌కు సంబంధిం చిన ఈ టెస్ట్‌లో 10 మార్కులకు లెటర్ రైటింగ్, 20 మార్కులకు ఎస్సే రైటింగ్ ఉంటాయి. ఈ పరీక్షను ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ టెస్ట్స్ అన్నింటిలో కంపెనీ నిర్ణయించిన కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులను డిస్ర్కిప్టివ్ టెస్ట్/ ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. డిస్ర్కిప్టివ్ టెస్ట్‌లో క్వాలిఫై అయితే చాలు. ఇందులో వచ్చిన మార్కుల్ని ఇంటర్వ్యూ లోగానీ ఫైనల్ సెలెక్షన్‌లో గానీ పరిగణనలోకి తీసుకోరు. కంపెనీలో ఉన్న ఖాళీలు, దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు.
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్‌లోని టెస్టులన్నింటినీ ఆన్‌లైన్ మోడ్‌లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్టుల్లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు పెనాల్టీ ఉంటుంది. సమాధానం గుర్తించకపోతే పెనాల్టీ ఉం డదు. ఈ పరీక్షలకు సంబంధించి ఏమైనా మార్పులు ఉంటే వాటి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
ఫేజ్ - 3 ఇంటర్వ్యూ :
ఫేజ్ 2 ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు కంపెనీ నిర్దేశిత సెంటర్లలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల వెయిటేజీ శాతాన్ని 80:20గా నిర్ణయించారు. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్స్‌ని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ సమయం, సెంటర్ వంటి వివరాలన్నీ కాల్ లెటర్స్‌లో ఉంటాయి. వీటికి సంబంధించి ఎటువంటి మార్పుల అభ్యర్థనను కంపెనీ అంగీకరించదు.
ఎగ్జామ్ సెంటర్లు: ఫేజ్-1 ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం,
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాలను నిర్దేశించారు.
ఫేజ్ - 2 ఎగ్జామ్ కోసం పై కేంద్రాల్లో కొన్నింటిని మాత్రమే కేటాయించారు. ఫేజ్ 2కు ఎంపికైన అభ్యర్థులను అనుసరించి కంపెనీ పరీక్ష కేంద్రాలను నిర్ణయిస్తుంది. అభ్యర్థికి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ వివరాలను కాల్ లెటర్‌లో చూడవచ్చు.
అభ్యర్థులు ఫేజ్ 1, ఫేజ్ 2లకు విడివిడిగా కాల్‌లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇందుకుగాను కంపెనీ, ఇమెయిల్/ ఎస్‌ఎంఎస్ ద్వారా అభ్యర్థులకు సమాచారమిస్తుంది.
ఫైనల్ సెలెక్షన్ :
మెయిన్ ఎగ్జామ్-ఆబ్జెక్టివ్ టెస్ట్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులు సాధించిన మెరిట్ ప్రకారం అప్పాయింట్‌మెంట్ ఇస్తారు. ఆఫీసర్ కేడర్‌లో సెలెక్టయిన అభ్యర్థులకు ఏడాది ప్రొబేషన్ ఉంటుంది.
అభ్యర్థులు వయసు, అర్హతకు సంబంధించి ప్రకటనలో ఇచ్చిన నిబంధనలకు విశదంగా చదువుకోవాలి. నిబంధనల ప్రకారం దరఖాస్తులో ఏదైనా తేడా వస్తే ఫైనల్ సెలెక్షన్‌కు చేరుకొన్న అభ్యర్థిని కూడా కంపెనీ తిరస్కరించే ప్రమాదముంది.
దరఖాస్తు ఫీజు: ఇంటిమేషన్ ఛార్జీలతో కలిపి రూ.600 ను దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులు రూ.100 (ఇంటిమేషన్ ఛార్జీలు) చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు తదితర సమా చారం కోసం వివరంగా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 14 నుంచి
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 1
ఫేజ్ - 1 ఆన్‌లైన్ ఎగ్జామ్: డిసెంబరు 17న
ఫేజ్ - 2 ఆన్‌లైన్ ఎగ్జామ్: 2017 జనవరిలో
వెబ్‌సైట్: www.newindia.co.in
Labels:
Job Notification
No comments:
Post a Comment