అమెజాన్...భారీ డిస్కౌంట్స్
ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఫెస్టివల్ సీజన్‌లో వినియోగదారులకు మరో అవకాశమిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లతో, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అమెజాన్ రెండో విడత ఆఫర్ సీజన్‌ను ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి 20వ తేదీలోపు అమెజాన్ ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. మూడు రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్కువ శాతం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్ పైనే డిస్కౌంట్స్ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డీల్ కూడా ఇప్పటికే దివాళి అన్‌బాక్స్ సేల్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే.
Labels:
General Info



No comments:
Post a Comment