Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

సంచలనం సృష్టించిన చిత్రం ‘ఆదిత్య 369’

మాస్‌ మసాలా యాక్షన్‌ సినిమాలు వెల్లువగా వస్తున్న కాలంలో ఆ ధోరణికి పూర్తి భిన్నంగా టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో సైన్స్‌ఫిక్షన్‌ కథాంశంతో వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం ‘ఆదిత్య 369’. 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఓ ఆణిముత్యంలా నిలిచిపోయింది. ఆ సినిమా విడుదలై సోమవారంతో పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దాని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఎస్పీ బాలుగారు ఓ రోజు సింగీతం శ్రీనివాసరావుగారి వద్ద ఓ మంచి కథ ఉందన్నారు. సింగీతం గారిని కలవగానే ట్రైమ్‌ ట్రావెలింగ్‌ మీద ఓ లైన చెప్పారు. కృష్ణదేవరాయలు టైమ్‌ అనగానే నందమూరి బాలకృష్ణ తప్ప మరెవరూ చెయ్యలేరని అనుకొన్నాను. ఓ రోజు నేను, సింగీతంగారు బాలకృష్ణగారిని కలిసి కథ చెప్పగానే ఆయన వెంటనే చేద్దామని మాటిచ్చారు. జంథ్యాలగారి సంభాషణలు, ఇళయరాజాగారి సంగీతం, సిరివెన్నెల, వెన్నెలకంటి సాహిత్యం, పేకేటి రంగా కళా దర్శకత్వం, ఎ సాంబశివరావు కాస్ట్యూమ్స్‌ ఇలా ఉద్దండులైన టెక్నీషియన్లతో ప్రారంభమైందీ ఈ సినిమా. చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట పి.సి.శ్రీరామ్‌ ఛాయగ్రాహకుడు. ఆయనకి సర్జరీ జరగడంతో వి.ఎ్‌స.ఆర్‌ స్వామి, కబీర్‌లాల్‌ ఆ బాధ్యతలు స్వీకరించారు. నాకున్న అనుభవం ప్రకారం కోటి ముప్పై లక్షల రూపాయిలు బడ్జెట్‌ అయితే అది సేఫ్‌ ప్రాజెక్ట్‌ అని నా నమ్మకం. అయితే మరో 30 లక్షల బడ్జెట్‌ పెరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లు, టైమ్‌ మెషీన కాన్సెప్ట్‌ జనాల్లోకి బాగా వెళ్లడం వల్ల డిస్టి్ట్రబ్యూటర్లు ఆ 30 లక్షలు పెట్టడానికి ముందుకొచ్చారు. ఎంతో ప్లానింగ్‌తో చేస్తే రూ. 1.52 కోట్లు ఖర్చయింది. ‘యుగపురుషుడు’, ‘ఆదిత్యుడు’ అనే టైటిళ్లు అనుకున్నాం. ఆదిత్యుడుని ఆదిత్య చేసి, టైమ్‌ ట్రావెలింగ్‌ లైన కాబట్టి 369 అనే ఎసెండింగ్‌ నంబర్‌ కలిపాం. అదే టైటిల్‌గా మారింది. 18 జూలై 1991న చిత్రాన్ని విడుదల చేశాం. ఇందులో బాలకృష్ణగారి నటన చూసి ఎన్టీఆర్‌ చాలా మురిసిపోయారు. విలనగా అమ్రి్‌షపురి, టిన్ను ఆనంద్‌, తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన, హీరోయిన మోహిని నటన ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నిర్మాతగా నన్ను నిలబెట్టిన చిత్రమిది. ప్రస్తుతం ఇలాంటి సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది’’ అని చెప్పారు.

No comments:

Post a Comment