Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు చేస్తున్న ‘లక్ష్మీ బాంబ్‌’ ఒక ఎత్తు

నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు చేస్తున్న ‘లక్ష్మీ బాంబ్‌’ ఒక ఎత్తు. నేనే కాదు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అదే విషయాన్ని చెబుతారు’’ అని చెప్పారు లక్ష్మీ మంచు. శనివారం ఆమె పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘‘ఈ ఏడాది నా పుట్టినరోజును మా అమ్మానాన్నలు, నా కూతురు, మేనకోడళ్ల మద్య నిర్వహించుకుంటా. ఒకప్పుడు నా పనులతో బిజీగా ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆలోచిస్తే అసలు పాప పుట్టకముందు నేను ఎలా ఉండగలిగాను? అని అనిపిస్తుంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని చక్కగా బాల్యన్స చేసుకుంటున్నా. ఈ మధ్యనే ‘లక్ష్మీ బాంబ్‌’ షూటింగ్‌ పూర్తి చేశా. త్వరలోనే విడుదలవుతుంది.


దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ నాకు కథ చెప్పకముందే ‘లక్ష్మీబాంబ్‌’ అనే టైటిల్‌ చెప్పారు. ఆ పదం వినగానే నాకు సిగ్గనిపించింది. ‘లక్ష్మీ బాంబ్‌’ అని ఎందుకు పెట్టారని అడిగా. ‘ఈ కథకి అదే సూటవుతుంది మేడమ్‌’ అన్నారు. సినిమా రన్నింగ్‌లో ఉండగా టైటిల్‌ని నిర్ణయిద్దామని, వర్కింగ్‌ టైటిల్‌గా ‘లక్ష్మీ బాంబ్‌’ అని పెట్టుకుందామని చెప్పా. కానీ దర్శకనిర్మాతలు పట్టుబట్టి ఈ సినిమాకు అదే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. కథకి కూడా చాలా యాప్ట్‌గా ఉంటుందనిపించి కన్విన్స అయ్యా. ‘లక్ష్మీ బాంబ్‌’ అనే పేరు బయటకు రాగానే నా మిత్రులు, సన్నిహితులు, అభిమానులు చాలా మంది ఫోన చేశారు. ‘ఈ టైటిల్‌ని ఇన్ని రోజులు ఎందుకు మిస్‌ అయ్యారు? ఇది కదా టైటిల్‌ అంటే..’ అని ప్రశంసించారు. ‘లక్ష్మీబాంబ్‌’కి ఉన్న పవర్‌ ఏంటో అప్పుడు అర్థమైంది నాకు. టైటిల్‌కి తగ్గట్టే సినిమా కూడా చాలా బావుంటుంది.

నా పాత్ర ఎవరూ సస్పెక్ట్‌ చేయలేనంత గొప్పగా ఉంటుంది. నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అవుతుంది. మంచి ఫ్యామిలీ కథతో అల్లుకున్న ఇంటెన్సిటీ ఉన్న చిత్రమిది. అన్నిరకాల భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. బేసిగ్గా నాకు నిజ జీవితంలో బ్రదర్స్‌ ఉండటం వల్ల ఈ పాత్రను సులువుగా చేయగలిగానేమోనని అనిపించింది. కార్తికేయ చాలా బాగా చేశారు. తనకేం కావాలో తెలిసిన దర్శకుడు ఆయన. నిర్మాతలు కూడా చక్కగా సపోర్ట్‌ చేశారు’’ అని అన్నారు. తదుపరి చిత్రాల గురించి చెబుతూ ‘‘ఈ మధ్యనే ఓ రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని అంగీకరించాను. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. మా నాన్నగారితో కలిసి ఓ సినిమాలో నటించాలని కోరికగా ఉంది. మంచి స్ర్కిప్ట్‌ దొరికితే తప్పకుండా ఒప్పుకుంటా. మరోవైపు ఎగ్జయిటింగ్‌ స్ర్కిప్ట్‌లు వస్తే సినిమాలను నిర్మిస్తా. ప్రస్తుతానికి ఇతర సంస్థలు నిర్మించే చిత్రాల్లో నటించడం హ్యాపీగా ఉంది’ అని చెప్పారు.

No comments:

Post a Comment