Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

జియో కి దిమ్మతిరిగే షాక్ యిచ్చిన ఐడియా ...

ఉచిత ఆఫర్లతో కస్టమర్లను జియో తన వైపునకు తిప్పుకుంటున్న నేపథ్యంలో అన్ని టెల్కోలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాయి. ఇందులో భాగంగా అన్ని కంపెనీలు భారీ ఆఫర్లకు తెరలేపాయి. కస్టమర్లను ఆఫర్ల మత్తులో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐడియా రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటాను ప్రవేశపెట్టింది. మరి దాన్నెలా పొందాలో చూద్దాం..

మీ వద్ద ఐడియా 4జీ సిమ్‌తోపాటు తప్పనిసరిగా 4జీ సపోర్ట్‌ చేసే ఫోన్‌ ఉండాలి. దీంతో పాటు మీ అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్‌ ఉండాలి. మీ 4జీ హ్యాండ్‌సెట్‌లో ఐడియా సిమ్‌ ఉంచి 411కు కాల్‌ చేయండి. అందులో చెప్పే సూచనలను ఫాలో అవ్వండి. సూచనల్లో మీకు 4జీ డేటాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆఫర్‌ యాక్టివేట్‌ అయిన తరువాత మీకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కన్ఫర్మేమేషన్‌ మెసేజ్‌ వస్తుంది. ఇక మీరు 4జీ అన్‌లిమిటెడ్‌ డేటాను వాడుకోవచ్చు. అయితే ఇది కేవలం ఓ గంట వరకు మాత్రమే. గంట తరువాత మీకు డేటా పనిచేయదు. ఈ ఆఫర్‌లో మీరు ఐడియా ఇచ్చే సూపర్‌ ఫాస్ట్‌ డేటాను గంట వరకు అపరిమితంగా వాడుకోవచ్చు. ఈ ఒక్క గంటలో మీరు 4జీబీ నుంచి 5 జీబీ వరకు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఇది యాక్టివేట్‌ అయిన తరువాత మీ పాత డేటా ప్యాక్‌ వెంటనే ఆగిపోతుంది. ఒకే నంబర్‌పై ఈ ఆఫర్‌ను మూడుసార్లు వాడకోవచ్చు. ఆ తరువాత ఈ ఆఫర్‌ పనిచేయదు. వేరే ఫోన్‌ నుంచి ప్రయత్నిస్తే మళ్లీ ఈ ఆఫర్‌ మీకు వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment