Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఆఛారి ముర్గ్‌ - Achaari Murg



కావలసిన పదార్థాలు: చికెన్‌: అరకిలో, ఉల్లిపాయలు: రెండు(ముక్కలుగా కట్‌ చేసుకోవాలి) వెల్లుల్లి రెమ్మలు:ఐదు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌ స్పూన్లు, పెరుగు: అరకప్పు, నిమ్మరసం: నాలుగు టేబుల్‌ స్పూన్లు, పసుపు: చిటికెడు, కారం పొడి: టేబుల్‌ స్పూను, ఉల్లి విత్తనాలు: టేబుల్‌ స్పూను, నెయ్యి: రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె: తగినంత 
మసాలా కోసం: ఉల్లి గింజలు: టేబుల్‌ స్పూను, ఆవాలు: కొద్దిగా, జీలకర్ర: కొద్దిగా, సోంపు: రెండు టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకు: కొద్దిగా, ఎండు మిర్చి: కొద్దిగా 

తయారీ విధానం: ముందుగా మసాలా దినుసులన్నీ నూనె లేకుండా వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చికెన్‌ ముక్కలకు నిమ్మరసం, పెరుగు, ఈ పొడి పట్టించి కనీసం అరగంట పాటు నాననివ్వాలి. అనంతరం మందపాటి గిన్నె తీసుకుని, నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు వేసి మరికొద్దిసేపు వేయించి ఇప్పుడు టమోటా ముక్కలు జతచేయాలి. ఇవి ఉడికిన తరువాత చికెన్‌ ముక్కలు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఇవి ఉడుకుతున్న సమయంలో ఉల్లిగింజలు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగానీరు పోసుకోవచ్చు. చివరగా నెయ్యి, కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి.

No comments:

Post a Comment