Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచే ఆయుర్వేద ఔషదాలు

ఆయుర్వేద ఔషదాలు మెదడు శక్తిని మాత్రమె కాకుండా, జ్ఞాపక శక్తి మరియు మెదడు యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. వీటి వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు మరియు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఆ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది. 
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes

1. ఆయుర్వేదం మరియు మెదడు

మానవ శరీరం అనేది ఒక మంత్రాలయంగా పేర్కొంటారు, మెదడులోని మస్తిష్కంను ప్రాధాన మంత్రిగా పేర్కొంటారు కారణం- ఈ భాగం యొక్క సమ్మతి లేకుండా, శరీరంలో ఏ పని జరగదు. ఆయుర్వేద ఔషదాలు మెదడులో ఉన్న లోపాలను సవరించటమే కాకుండా మెదడు యొక్క శక్తి మరియు సామర్థ్యాన్ని పెంచుతాయి. ఆ ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది. 

2. బ్రాహ్మి

జ్ఞాపక శక్తిని పెంచుటకు సాధారణంగా వాడే ఔషదంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే రసాయనాలు మెదడులో ప్రోటీన్ ఉత్పత్తిని పెంచి, వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా, మానసిక శక్తిని కూడా పెంచుతుంది. ఈ ఔషదం యాంటీ- డిప్రసేంట్ మరియు యాంటీ- ఆంక్సైటీ కారకాలుగా పనిచేయటం వలన ఈ మూలకం నుండి తీసిన నూనెతో తలపై మాసాజ్ చేయటం వలన విశ్రాంతిని పొందుతారు. 
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes
3. శంక పుష్పీ
జ్ఞాపక శక్తి లోపించిన వారికి వాడే సాధారణ ఔషదంగా చెప్పవచ్చు. ఈ ఔషద వాడకం వలన జ్ఞాపక శక్తి పెరగటమే కాకుండా, సహాజంగా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ ఔషదం జ్ఞాపక శక్తిని పెంచటమే కాకుండా, మానసిక ఒత్తిడిని మరియు రక్తపీడనాన్ని కూడా నియంత్రిస్తుంది. భారతదేశంలో చిన్న పిల్లలకు వారి పరీక్ష సమయాల్లో జ్ఞాపక శక్తి పెరుగుటకు ఈ ఔషదాన్ని వాడతారు.
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes
4. మేధ్య ద్రవ్యా
ఈ ఔషదం, లికోరైస్ వర్గానికి చెందినది మరియు నూతనంగా జ్ఞాపక శక్తి పెరుగుటకు వాడుతున్నారు. ఈ ఔషద వాడకం వలన జ్ఞాపక శక్తి పెరగటమే కాకుండా జలుబు, దగ్గు, కంటి చూపులో మెరుగుదల మరియు గ్యాస్ట్రిక్ ఆసిడ్ వంటి వాటిని తగ్గిస్తుంది. మెదడు యొక్క శక్తిని పెంచుటకు ఇది సరైన ఔషదంగా పేర్కొనవచ్చు. 
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes
5. ములేటి
మెదడు యొక్క ఆరోగ్యాన్ని పెంచే సరైన ఔషదంగా చెప్పవచ్చు. దీన్ని సాధారణంగా మనసిక ఒత్తిడిని తగ్గించుటకు వాడతారు. ఈ ఔషదం మెదడు యొక్క పూర్తి ఆరోగ్యాన్ని పెంచి, మానసికంగా సంతృప్తిని కలుగచేస్తుంది. అంతేకాకుండా, ఈ ఔషద వాడకం వలన నాడీ వ్యవస్థ మరియు రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. 
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes
6. గోటుకోల
గోటుకోల యొక్క ముఖ్య విధి, శరీరంలో మరియు మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపరచటం అని చెప్పవచ్చు. ఈ ఔషదం శక్తిని అందించటమే కాకుండా, మెదడు కాణాలను కాపాడతాయి. మెదడు యొక్క శక్తిని మరియు సామర్థ్యాన్ని కూడా పెంచి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes
7. అశ్వగంధ
అశ్వగంధ అనేది ఒత్తిడిని తగ్గించే ఔషదం మాత్రమె కాకుండా. మెదడుకు విశ్రాంతి చేకూర్చి, దాని పని తీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇది ముఖ్యంగా మెదడును ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి, మెదడు పని తీరును అధికం చేస్తుంది. మెదడు నరాలను ఉత్తేజపరచి, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes
8. గిలోయ్ (తిప్పతెగ)
గిలోయ్ అనేది మెదడుకు లాభాన్ని చేకూర్చే మరొక ఆయుర్వేద ఔషదంగా చెప్పవచ్చు. మెదడులోని నిర్జీవ కణాలను బదిలీ చేసి, నాడీవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. మెదడు సామర్థ్యాని పెంచే మరొక ఆయుర్వేద ఔషదంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా, మెదడులో ప్రమాదానికి గురైన కణాలను తొలగిస్తుంది. 
Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes

No comments:

Post a Comment