Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

నోకియా నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ Nokia 6...

చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత నోకియా నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ Nokia 6 చైనా మార్కెట్లో ఫ్లాష్ సేల్ పై విక్రయించబడుతోన్న విషయం తెలిసిందే.
Nokia-6-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers


JD.com ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న ఈ ఫోన్ విడుదలకు ముందు భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడిన ఈ ఫోన్ 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.నోకియా అభిమానుల భారీ అంచనాల మధ్య మార్కెట్లో అయిన నోకియా 6 బెంచ్ మార్క్ స్కోర్‌ను Geekbench విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం నోకియా 6 44,517 పాయింట్లను స్కోర్ చేయగలిగింది.

ఇదే సమయంలో యాపిల్ ఐఫోన్ 7 స్కోర్ 190,000 పాయింట్లుగాను, వన్‌ప్లస్ 3టీ స్కోర్ 160,000 పాయింట్లుగాను ఉంది.ముందుగా పేర్కొన్నట్లుగానే నోకియా 6, హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు. ఇదో మిడ్ రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. మరి ఇలాంటి ఫోన్ ను ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3టీలతో పోల్చి చూడటం అంతగా కరెక్ట్ కాదు.
Nokia-6-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

Geekbench వెల్లడించిన స్కోర్ ప్రకారం చూస్తే, నోకియా 6 ఫోన్‌లో హై-ఎండ్ గేమ్స్ అలానే యాప్స్‌ను రన్ చేయటం కొద్దిగా కష్టమే. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే..? నోకియా 6 ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. బార్సిలోనా వేదికగా ఫిబ్రవరిలో జరగబోతున్నమొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017ను పురస్కరించుకుని HMD Global ఓ హై-ఎండ్ నోకియా స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు తెలియవచ్చింది.తాజాగా అందుతోన్న రిపోర్ట్స్ ప్రకారం నోకియా 6 స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి జనవరి 19న జరిగిన మొదటి ఫ్లాష్ సేల్ లో భాగంగా కేవలం 60 సెకన్ల వ్యవధిలో 100,000 మంది యూజర్లు ప్రీఆర్డర్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన రెండవ ఫ్లాష్ సేల్ జనవరి 25న జరుగుతుది.
Nokia-6-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

నోకియా 6 స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.


No comments:

Post a Comment