సైకిల్ తొక్కుతున్నారా...

సైకిల్  ఒకనాటి రవాణా అవసరం. ఇప్పుడది వ్యాయమ సాధనం  శారీరిక వ్యాయమానికే కాదు ఏంటో మానసిక ప్రశాంతతనీ  ఇస్తుంది. 

1. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు కావాల్సిన వ్యాయామం దొరుకుతుంది. ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. రోజుకి కనీసం ఐదు  నిముషాల పటు సైకిల్ తొక్కినా జీర్ణ వ్యవస్థ సక్రమంగా  చేస్తుంది.  బరువు తగ్గుతారు. 

2. నడుము చుట్టు కొలత ఎక్కువగా ఉన్నవాళ్లకు సైకిల్ తొక్కడం ఓ ఔషధంలాగే ఉపయోగపడుతుంది. సైకిల్ తొక్కేటప్పుడు మనసు ఉల్లాసంగా మారి రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచుతుంది. చెమట ఎక్కువగా రావడం వల్ల శరీరం లోని టాక్సిన్లు బయటకెళ్తాయి . 

3. మధుమేహం రోగులకు ఇది మంచి చికిత్స కూడా .. ! సైకిల్ తొక్కడం వలన రాత్రి పూట నిద్ర సక్రమంగా పడుతుంది. పొద్దుటిపూట సైకిల్ తొక్కడం వలన మనలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎండ నుండి వచ్చే రేడియేషన్ కిరణాలు ధాటికి తట్టుకోగలం కూడా. 

4. గుండెకు రక్త ప్రసరణ స్థాయిని పెంచడంలో సాయపడుతుంది. తద్వారా ఆక్సీజెన్ మెదడుకు సరిగ్గా అందుతుంది. మతిమరుపు  సమస్యలు, పరధ్యానం వంటివి తగ్గుతాయి. 

No comments:

Post a Comment