స్నాప్‌డీల్ పండుగ వేళ సరికొత్త ఆఫర్‌



స్నాప్‌డీల్ పండుగ వేళ  అన్‌బాక్స్ దివాళి సేల్‌లో భాగంగా ఐఫోన్ 7మోడల్‌‌పై యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10వేల డిస్కౌంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 



అయితే ఈ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు స్నాప్‌డీల్ తాజాగా ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై స్నాప్‌డీల్ ప్రకటించిన ఆఫర్ అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ నాటికి ముగిసింది. అయితే ఈ రోజుల్లో కొనలేకపోయిన వారికి స్నాప్‌డీల్ మరో అవకాశం ఇచ్చింది. రెండో విడత ఆఫర్ తేదీలను సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 14 వరకూ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

No comments:

Post a Comment