నకిలీ నోట్లు ఉన్నాయి. ఏం చేయాలి? ....
డెబిట్ కార్డు తీసుకెళ్ళి అవసరమైన సొమ్ము తీసుకున్నారు. అందులో కొన్ని నకిలీ నోట్లు ఉన్నాయి. ఏం చేయాలి? ఆ నోట్లు ఏటీఎం నుంచే వచ్చాయని ఎలా నిరూపించాలి? జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి? సైబర్ క్రైమ్ అధికారులు ఇస్తున్న సలహాలను పరిశీలించండి.
నకిలీ నోట్లను ఏటీఎంలోనే గుర్తించడం తప్పనిసరి. వాటిని వెంటనే అదే ఏటీఎంలో ఉండే సీసీటీవీలో చూపించాలి. అది పని చేయకపోతే అక్కడే ఉన్న గార్డుకు ఈ విషయం చెప్పాలి. నకిలీ నోట్లను ఆయనకు చూపించాలి. ఇవేవీ చేయకుండా ఏటీఎం కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోతే మాత్రం ఆ నకిలీ నోట్లు ఆ ఏటీఎం నుంచే వచ్చాయని నిరూపించడం కష్టం.
కొత్తగా వస్తున్న ఏటీఎంలలో కరెన్సీ నోట్లను సక్రమంగా గుర్తించే పరికరాలు ఉంటున్నాయి. ఎఫ్ఎస్ఎస్, ఏజీఎస్, సీఎంఎస్, ఓఈఎం, డైబోల్డ్, ఎన్‌సీఆర్, హిటాచీ ఏటీఎంలలో కరెన్సీ నోట్లను గుర్తించే నమ్మకమైన టెక్నాలజీ ఉంది. నగదును డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసుకున్నా ఆ కరెన్సీ నోట్లు మంచివేనా, నకిలీవా? అనే అంశాన్ని కచ్చితంగా గుర్తించగలవని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఎండీ రవి గోయల్ చెప్పారు.
అయితే ఇప్పటికీ కొన్ని బ్యాంకుల ఏటీఎంలు దాదాపు 12 ఏళ్ళ పాత కాలం నాటి టెక్నాలజీతో పని చేస్తున్నాయి. వీటిని మార్చాలని రిజర్వు బ్యాంకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
Labels:
General Info
No comments:
Post a Comment