51 బ్యాంకులకు....ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు
ప్రస్తుత కరెన్సీ సంక్షోభంలో, డిజిటల్ కరెన్సీ ఉపయోగించమని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో, కేవలం మీ మొబైల్ తోనే, చాలా రకాల సేవలు వినియోగించుకోవచ్చు. బ్యాలన్స్ తెలుసుకోవడం, మినీ స్టేట్మెంట్, ఒక ఎకౌంటు నుంచి ఇంకో ఎకౌంటు కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్‌నెట్‌తో కూడా పనిలేదు. ఏ రకమైన GSM ఫోనుల్లో అయినా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి *99#కు డయల్ చేస్తే చాలు. ఇప్పటివరకు 51 బ్యాంకులు ఈ సర్వీస్ లో ఉన్నాయి.
*99# విశేషాలు :
- ఈ సర్వీస్ ఉపయోగించాలి అంటే, ఇంటర్నెట్ కు సంబంధం లేదు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు.
- అన్ని టెలికాం సర్వీసులు నుంచి, ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు
- అన్ని రకాల GSM మొబైల్ ఫోన్స్ లో ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు
- ఈ సర్వీస్ మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా 24/7 ఉపయోగించవచ్చు
- ఏ రకమైన యాప్ మీ ఫోనులో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు
- మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉండాలి
- మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, వాళ్ళ మొబైల్ నెంబర్, ఆదార్ నెంబర్, బ్యాంకు ఎకౌంటు నెంబర్, MMID నెంబర్, IFSC కోడ్ మొదలైనవి మీ దగ్గర ఉంచుకోండి.
*99# ఏ రకమైన సర్వీసులు చెయ్యవచ్చు :
- ఫండ్స్ ట్రాన్స్ఫర్
- ఎకౌంటు బ్యాలన్స్
- మినీ స్టేట్మెంట్
- వన్ టైం పాస్వర్డ్ జెనరేట్ చెయ్యటానికి
- మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ జెనరేట్ చెయ్యటానికి
- మీ బ్యాంకు ఎకౌంటు ఆదార్ తో లింక్ అయ్యిందో లేదో, తెలుసుకోవటానికి
బ్యాంక్ అకౌంట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి *99#కు డయల్ చెయ్యాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వకపోతే, మీ బ్యాంకుకి వెళ్లి, రిజిస్టర్ చేసుకోవాలి.
- మొబైల్ నుంచి *99#కు డయల్ చేసిన తరువాత NUUP (NUUP- National Unified USSD Payments) నుంచి, వెల్కమ్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ OK ప్రెస్ చెయ్యాలి.
- తరువాత, మీ బ్యాంకు యొక్క 3 లెటర్స్ షార్ట్ నేమ్ కాని, మీ బ్యాంకు యొక్క IFSC కోడ్, మొదటి నాలుగు అక్షరాలు కాని, లేకపోతే 2 డిజిట్ డైరెక్ట్ కోడ్ కాని ఎంటర్ చెయ్యాలి. Ex: స్టేట్ బ్యాంకు షార్ట్ నేమ్ SBI, IFSC కోడ్ మొదటి నాలుగు అక్షరాలు SBIN,2 డిజిట్ డైరెక్ట్ కోడ్ 41. మీరు 2 డిజిట్ డైరెక్ట్ కోడ్ తో , మీ మొబైల్ నుంచి *99*41# డయల్ చేస్తే, మీ SBI ఎకౌంటు ఆక్సెస్ అవుతుంది.
- మీకు ఇక్కడ కొన్ని ఒప్షన్స్ ఉంటాయి. ఎకౌంటు బ్యాలన్స్, మినీ స్టేట్మెంట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ లాంటి ఆప్షన్స్ లో మీకు అవసరం అయినది సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం ఎలా ?
ఫండ్స్ ట్రాన్స్ఫర్ మూడు రకాలుగా చెయ్యవచ్చు. RBI నిభందనలు ప్రకారం రోజుకి Rs.5000 వరుకే ట్రాన్స్ఫర్ చెయ్యవచ్చు
ఆధార్ నెంబర్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం :
- ముందుగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి "Fund Transfer using beneficiary Aadhaar number"
- మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చెయ్యాలో, వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి, అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చెయ్యాలి, ఎంటర్ చెయ్యండి.
- తరువాత, ఈ ట్రాన్స్ఆక్షన్ ఓకే చెయ్యటానికి, MPIN ఎంటర్ చెయ్యాలి.
- ఆ ఆధార్ నెంబర్ తో, ఏ బ్యాంకు ఎకౌంటు అయితే లింక్ అయ్యి ఉందో, ఆ ఎకౌంటు లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది.
- Enter 5 for Fund Transfer using beneficiary Aadhaar number.
- Subsequent screen to enter Beneficiary Aadhaar Number will appear.
- Enter MPIN and last 4 digits of account number (Optional).
IFSC కోడ్,బ్యాంక్ ఎకౌంటు నెంబర్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం :
- ముందుగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి "Fund transfer using IFSC code"
- మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చెయ్యాలో, వాళ్ళ ఎకౌంటు నెంబర్, 11 డిజిట్ IFSC కోడ్, అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చెయ్యాలి, ఎంటర్ చెయ్యండి.
- తరువాత, ఈ ట్రాన్స్ఆక్షన్ ఓకే చెయ్యటానికి, MPIN ఎంటర్ చెయ్యాలి.
- Enter 4 for IFSC Fund Transfer
- Enter account number and 11 digit IFSC of the Beneficiary
- Enter the amount (space) remarks, which is optional
- Enter MPIN to approve the transaction
MMID’ (Mobile Money Identifier) ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం :
- ముందుగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి "Fund transfer using MMID"
- ముందుగా మీరు ఎవరకి అయితే ట్రాన్స్ఫర్ చెయ్యాలి అనుకుంటున్నారో, వాళ్ళ 10 డిజిట్ మొబైల్ నెంబర్, వాళ్ళ 7 డిజిట్ MMID నెంబర్, అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చెయ్యాలి, ఎంటర్ చెయ్యండి. MMID నెంబర్ తెలుసుకోవటానికి వాళ్ళ బ్యాంకుని సంప్రదించవచ్చు.
- తరువాత, ఈ ట్రాన్స్ఆక్షన్ ఓకే చెయ్యటానికి, MPIN ఎంటర్ చెయ్యాలి.
- Enter 3 for MMID Fund Transfer
- Enter 10 digit Mobile number(space) 7 digit MMID of the Beneficiary
- Enter the amount (space) remarks, which is optional
- Enter MPIN to approve the transaction
బ్యాంకు బాలన్స్ తెలుసుకోవటం ఎలా ?
- పైన చెప్పిన విధంగా ముందు, మీ ఎకౌంటు కి కనెక్ట్ అవ్వాలి.
- తరువాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవటానికి, 1 నొక్కితే చాలు, మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో మొబైల్‌లో ప్రత్యక్షమవు తుంది.
బ్యాంకు మినీ స్టేట్మెంట్ తెలుసుకోవటం ఎలా ?
- పైన చెప్పిన విధంగా ముందు, మీ ఎకౌంటు కి కనెక్ట్ అవ్వాలి.
- తరువాత మీ బ్యాంక్ మినీ స్టేట్మెంట్ తెలుసుకోవటానికి, 2 నొక్కితే చాలు, మీ బ్యాంక్ మినీ స్టేట్మెంట్ మొబైల్‌లో ప్రత్యక్షమవు తుంది. ఆకరి 3 ట్రాన్స్ఆక్షన్స వివరాలు తెలుస్తాయి.
మీ బ్యాంకు యొక్క 3 లెటర్స్ షార్ట్ నేమ్ కాని, మీ బ్యాంకు యొక్క IFSC కోడ్, మొదటి నాలుగు అక్షరాలు కాని, లేకపోతే 2 డిజిట్ డైరెక్ట్ కోడ్ కాని ఇక్కడ తెలుసుకోండి :
ఈ క్రింద పేర్కున్న టెలికాం కంపెనీలు ఈ సేర్విసును ఇస్తున్నాయి :
Labels:
General Info
No comments:
Post a Comment