Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

అల్సర్లు రావడానికి..........అసలు కారణం బ్యాక్టీరియా

Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes

కొందరికి కడుపు ఖాళీ అయితే నొప్పి మొదలవుతుంది. కొందరికి కడుపు నిండితే నొప్పి మొదలవుతుంది. ఒక్కొక్కరిని ఒక్కోలా  ఎప్పుడూ కడుపునొప్పితో విలవిల్లాడేలా చేసే ఈ  అల్సర్లకు అడ్డుకట్ట వేయకుండా ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? పోనీ అల్సర్‌ ఎప్పటికీ అల్సర్‌గానే ఉండిపోతుందా అంటే అదీ లేదు. కాలం గడిచే కొద్దీ అసైటిస్‌, పర్‌ఫొరేషన్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురిచేస్తుంది.అల్సర్లు రావడానికి  హెచ్‌.పైలోరి (హెలికో  బ్యాక్టీరియం పైలోరి) అనే బ్యాక్టీరియా అసలు కారణం. అయితే ఈ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నంత కాలం అది ఏమీ చేయదు. కానీ, ఏ కారణంగానైనా జీర్ణాశయంలో గానీ, పేగుల్లో గానీ, ఉండే శ్లేష్మపొర దెబ్బతిన్నప్పుడే ఈ బ్యాక్టీరియా దాడిచేస్తుంది. అల్సర్‌ను కలిగిస్తుంది.మన జీర్ణాశయంలో ఉత్పన్నమయ్యే జీర్ణరసాల్లో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ప్రధానమైనది. ఈ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని తట్టుకునే శక్తి జీర్ణాశయ గోడలకు అంటే   శ్లేష్మపొర (మ్యూకస్‌ మెంబ్రేన్‌)కు  సహజసిద్ధంగానే ఉంటుంది. కాకపోతే మన జీవన శైలిలోపాలు, తీసుకునే విరుద్ధ ఆహారం ప్రభావం వల్ల కొందరిలో ఈ శ్లేష్మపొర దెబ్బ తింటుంది. ఫలితంగా జీర్ణాశయ గోడల మీద పుండ్లు ఏర్పడతాయి. 

ఇవీ కారణాలు :

రోజూ ఆహారం తీసుకునే నిర్ణీత వేళల్లో కడుపులో జీర్ణరసాలు ఉత్పన్నమవుతాయి. సమస్య ఏమిటంటే ఆ నిర్ధిష్ట వేళలకు అలవాటు పడిన ఈ రసాలు భోజనం చేసినా చేయకపోయినా ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఎక్కువసార్లు నిర్ణీత వే ళల్లో భోజనం చేయకుండా ఉండిపోవడం,ఈ జీర్ణరసాల్లో ఉండే హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం జీర్ణాశయ గోడలు లేదా శ్లేష్మపొర మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా ఆ భాగాల్లో పుండ్లు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా అదే అల్సర్‌గా మారుతుంది. లివర్‌, కిడ్నీలు వ్యాధిగ్రస్తం కావడం కూడా ఇందుకు కారణమే. 

ఎలా తెలుస్తుంది? 

పొట్టకు కొంచెం పై భాగంలోనూ, ఛాతీలోనూ  మంట, నొప్పి ఉంటాయి. ఆకలి తగ్గిపోయి కడుపులో ఎప్పుడూ ఉబ్బరంగానూ వికారంగానూ అనిపిస్తుంది. తరుచూ పుల్లని తేన్పులు వస్తాయి. రక్తపు వాంతులు రావడం,  మలంలో రక్తం పడటం కనిపిస్తుంది. పైల్స్‌లో కూడా మలంలో రక్తం వస్తుంది. కాకపోతే ఈ రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది. అదే అల్సర్‌ కారణంగా వచ్చే రక్తం నలుపు రంగులో ఉంటుంది. ఇలా రావడాన్ని మెలైనా అంటారు. అయితే జీర్ణాశయ కేన్సర్‌లో కూడా  రక్తం నలుపు రంగులో వస్తుంది. అందుకే చాలా మంది అల్సర్‌ను కేన్సర్‌గానూ పొరబడే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం వెక్కిళ్లు రావడం ఇందులో ఒక సమస్య. కొందరిలో ఈ వెక్కిళ్లు, రోజుల పర్యంతం కూడా కొనసాగే  ప్రమాదం ఉంది. క్రమంగా శరీరం బరువు తగ్గిపోవడం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్సర్‌ నొప్పి కొందరిలో భోజనం చేసిన వెంటనే తగ్గిపోతుంది. మరికొందరిలో తినగానే నొప్పి పెరుగుతుంది.‘అన్నద్రవ శూల’ అంటారు.  తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాకముందు నొప్పి ఉంటే, అది వాంతి కాగానే  నొప్పి తగ్గిపోతే దాన్నిఅన్నద్రవ శూల  (గ్యాస్ట్రిక్‌ అల్సర్లు)అంటారు. ఈ అల్సర్లలో నోటి నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంది. చిన్న పేగులోని మొదటి భాగంలో వచ్చే ఈ అల్సర్లను డియోడినల్‌ అల్సర్లు అంటారు. తిన్న ఆహారం జీర్ణమవుతున్న సమయంలో కడుపులో నొప్పి అధికంగా ఉండి, మళ్లీ ఏదైనా  తిన్నప్పుడు తగ్గుతుంది. వీటిని పరిణామ శూల (డియోడినం అల్సర్లు) అంటారు. ఇందులో మలంతో రక్తం వస్తుంది. 

నిర్లక్ష్యం చేస్తే :

అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే, కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కడుపంతా ఉబ్బిపోయే జలోదరం సమస్య రావచ్చు. దీన్నే అసైటిస్‌ అంటారు. ఒక్కోసారి అల్సర్‌ పుండు చితికిపోయి తిన్న ఆహారం పేగుల్లోకి  వ్యాపిస్తుంది.దాంతో విపరీతమైన కడుపునొప్పి మొదలవుతుంది. దీన్నే పర్‌ఫొరేషన్‌ అంటారు. విపరీతంగా రక్తస్రావం కావడంతో పాటు  ఆమాశయంలో, పేగుల్లో , జీర్ణాశయంలో  రంద్రాలు పడే  ఈ సమమస్యతో కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. 

చికిత్సలో భాగంగా :

అల్సర్లకు చేసే ఆయుర్వేద చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది జీర్ణ రసాల అధిక  ఉత్పత్తిని నియంత్రించడం, రెండవది  ఏర్పడిన అల్సర్లను మానిపోయే చికిత్స చేయడం. అలా మానిపించే ఔషధాలను  రోపణ ద్రవ్యాలు  ఉంటారు. అందేలోనూ,  శమన చికిత్స, శోధన  చికిత్స అంటూ మళ్లీ రెండు రకాలుగా ఉంటుంది. శమన  చికిత్సలో ఏర్పడిన అల్సర్‌ను తగ్గించే రోపన ద్రవ్యాలను వాడటం జరుగుతుంది. ఆమ్లపిత్తం అంటే పిత్తం ప్రకోపం చెందడమే అల్సర్లకు కారణం కాబట్టి, పిత్తాన్ని  తగ్గించే పిత్తశామక ద్రవ్యాలు ఇస్తాం.రక్తస్రావం కూడా అల్సర్లలో సమస్యే కాబట్టి రక్తస్థంభక ద్రవ్యాలు,  రక్తపిత్త హర చికిత్సలు కూడా ఉంటాయి. ఇక శోధన  చికిత్సలో భాగంగా పాలకు  పుండ్లను తగ్గించే శక్తి ఉండ డం వల్ల పాలు ప్రధాన అంశంగా ఉండే క్షీరవస్తి చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. వమన చికిత్సలు, రోపణ చికిత్సలు, క్షీరవస్తి చికిత్సలతో అల్సర్‌ సమస్యలు శాశ్వతంగా నయమైపోవడం తథ్యం. 

No comments:

Post a Comment