Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఇండియన్‌ నేవీ లో జాబ్ కావాలా ...త్వరపడండి

ఇండియన్‌ నేవీ- కింది విభాగాలు/ కేడర్లలో గ్రాంట్‌ ఆఫ్‌ పర్మెనెంట్‌ కమిషన్‌(పిసి) & షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) కోసం అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 


ఎడ్యుకేషన్ కమిషన్‌ పేరు: పిసి

వయసు: 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హత: బిఎస్సీ(మేథ్స్‌) + ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌) లేదా బిఎస్సీ(ఫిజిక్స్‌) + ఎమ్మెస్సీ(మేథ్స్‌)లేదా బిఎస్సీ (ఫిజిక్స్‌) + ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) లేదా ఇంటర్‌ (ఎంపిసి) + ఎమ్మే(ఇంగ్లీష్‌) లేదా ఎమ్మే (హిస్టరీ) లేదా బిఇ/ బిటెక్‌/ ఎంటెక్‌(మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అయితే డిగ్రీ స్థాయిలో 60 శాతం మార్కులు, పీజీ స్థాయిలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

లాజిస్టిక్స్‌ కమిషన్‌ పేరు: ఎస్‌ఎస్‌సి

వయసు: 19 1/2 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు్క్ష మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: 60 శాతం మార్కులతో బిఇ/బిటెక్‌ గానీ ఎంబిఏ గానీ బిఎస్సీ(జనరల్‌/ ఐటి)/ బికాం / పీజీ డిప్లొమా(ఫైనాన్స్‌/ లాజిస్టిక్స్‌/ సప్లై చైన్‌ మేనేజ్‌ మెంట్‌/ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)/ ఎంసిఏ/ ఎమ్మెస్సీ(ఐటి) ఉత్తీర్ణులై ఉండాలి. దేనిలోనైనా 60 శాతం మార్కులు తెచ్చుకొని ఉండాలి.

ఎంపిక: మెరిట్‌, ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా, ముందుగా అభ్యర్థులను అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఈ ప్రక్రియ బెంగళూరు, భోపాల్‌, కోయంబత్తూరు, విశాఖపట్నం నగరాల్లో డిసెంబరు 16 నుంచి 2017 మార్చి వరకు జరుగుతుంది. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇందులో స్టేజ్‌-1, స్టేజ్‌-2 టెస్ట్‌లను నిర్వహిస్తారు. స్టేజ్‌-1లో ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌, పిక్చర్‌ పర్‌సెప్షన్‌, డిస్కషన్‌ టెస్ట్‌ ఉంటాయి. స్టేజ్‌-1లో క్వాలిఫై కాని అభ్యర్థులను బోర్డు నుంచి పంపివేస్తారు. స్టేజ్‌-1లో క్వాలిఫై అయినవారికి స్టేజ్‌- 2 నిర్వహిస్తారు. ఇందులో సైకలాజికల్‌ టెస్టింగ్‌, గ్రూప్‌ టెస్టింగ్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-2లో క్వాలిఫై అయినవారికి మెడికల్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. ఇందులో ఫిట్‌గా ఉన్నవారిని ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌కు పంపుతారు. ఎజిమల నేవెల్‌ అకాడమీ వద్ద 2017 జూన్‌ నుంచి ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమవుతుంది. ఇది పూర్తయిన తరవాత అకాడమీ వద్ద నేవెల్‌ ట్రైనింగ్‌ సంస్థలు/ యూనిట్లు/ షిప్పుల్లో నేవెల్‌ ఓరియెంటేషన్‌ కోర్సు నిర్వహిస్తారు. అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబెషన్‌ ఉంటుంది.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం కాపీని కింది చిరునామాకు ఆర్డినరీ పోస్టు ద్వారా పంపుకోవాలి. స్పీడ్‌ పోస్టు/ రిజిస్టర్డ్‌ పోస్టు/ కోరియర్‌ ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించరు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 14

దరఖాస్తు కాపీ పోస్టు ద్వారా చేరేందుకు ఆఖరు తేదీ: 2016 అక్టోబరు 24

చిరునామా: Post Box No.04, RK Puram Main PO, New Delhi- 110066.
వెబ్‌సైట్‌: www.joinindian navy.gov.in

No comments:

Post a Comment