Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఎంత గొప్ప శాస్త్రవేత్తో...మరి ఈ ప్రయోగంలో ఏం జరిగిందో

15 వ శతాబ్దానికి చెందిన గెలీలియో గెలీలి గురుంచి తెలియని వారు ఉండరు. ఈ కాలంలో మనం ఇతర గ్రహాలను, నక్షత్రాలను, పాలపుంతలను చూడటానికి వాడే టెలీస్కోప్ ని కనుగొన్నది ఈయనే. ఆ కాలంలోనే ఇంత  అద్భుతమైన పరికరాన్ని కనుగొన్నాడంటే.. ఊహించుకోండి గెలీలియో ఎంత  గొప్ప శాస్త్రవేత్తో...

భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు , భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త అయిన గెలీలియో... ఆనాడే ఓ అద్భుతమైన విషయాన్నీ చెప్పాడు. అదేంటంటే... పై నుండి ఏవైనా రెండు వస్తువులు పడుతున్నాయి అంటే ఆ రెండు వస్తువులు
ఒకే సమయంలో భూమిని తాకుతాయి అని చెప్పాడు. అంటే బరువైన రాయిని అలాగే అత్యంత తేలికైన పక్షి ఈకని .. ఒకే సారి , ఒకే ఎత్తు నుండి వదిలి వేస్తే ఆ రెండు ఒకే సమయానికి నేలను తాకుతాయి అని వివరించాడు. కాకపొతే ఆ ప్రదేశంలో గాలి ఉండకూడదు అని చెప్పాడు. మరి గాలి లేని ప్రదేశాన్ని ఎక్కడినుండి తేగలరు చెప్పండి? అందుకే ఆ కాలంలో ఈ విషయాన్ని  అర్థం చేసుకోవడం కాస్త కష్టం అయింది.

సాధారణంగా ఏవైనా ట్రెండు వస్తువుల్ని ఒకే ఎత్తు నుండి వదిలినపుడు... ఆ రెండిలో బరువైన వస్తువు వేగంగా కింద పడుతుంది. కానీ గెలీలియో చెప్పిన విషయం ప్రకారం రెండు కూడా ఒకేసారి పడాలి. అందుకే 4 శతాబ్దాల తర్వాత... ఇప్పుడు  అందుబాటులో ఉన్న టెక్నాలజీ ని వాడి... ఒక పెద్ద వాక్యూమ్ ఛాంబర్ లో... బి.బి.సి ఛానెల్ వారు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మరి ఈ ప్రయోగంలో ఏం జరిగిందో మీరే చుడండి.

No comments:

Post a Comment