స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలో నిర్లక్ష్యం.....వద్దు
స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్న హ్యాకర్లు వారి ఫోన్‌లలో రకరకాల వైరస్‌లను ప్రవేశపెట్టి కీలకమైన వ్యక్తిగత డేటాను దొంగిలించేస్తున్నారు. హ్యాకర్ల భారిన పడుతున్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మీ మొబైల్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్‌ను ఇప్పుడు సూచించటం జరుగుతోంది..
ఆన్‌లైన్ షాపింగ్ చేసే అలవాటు ఉందా:
మీకు ఆన్‌లైన్ షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఆఫర్ల మత్తులో మునిగి ఫేక్ వెబ్‌సైట్‌ల ఉచ్చులో ఇరుక్కోకండి. జెన్యున్ వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించండి.
పబ్లిక్ వై-ఫైకు దూరంగా ఉండండి:
పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వై-ఫై హాట్ స్పాట్‌లకు దూరంగా ఉండండి. ఇక్కడే మీ డేటా కోసం హ్యాకర్లు కాచుకుని కూర్చొని ఉంటారు.
యాంటీ వైరస్ అవసరం:
మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్, స్కేర్‌వేర్, స్పైవేర్ వంటి ప్రమాదకర వైరస్‌లు మీ ఫోన్‌ను చుట్టుముట్టకండా ఉండేందుకు శక్తివంతమైన యాంటీవైరస్ ప్రొటెక్షన్‌ను సెట్ చేసుకోండి.
ప్రతి అప్లికేషన్‌కు పాస్‌వర్డ్ అవసరం:
మీ ఫోన్‌లోని ప్రతి అప్లికేషన్‌కు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. ఇలా చేయటం ఆ యాప్‌లను మీరు తప్ప వేరొకరు ఓపెన్ చేయలేరు.
వ్యక్తిగత డేటా :
మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను పబ్లిక్ వై-ఫై లేదా హాట్ స్పాట్ ద్వారా షేర్ చేయకండి. ఇవి డేటా తెఫ్ట్‌కు ప్రధాన ప్రోన్ ఏరియాలు ఇవే.
Find Your Phone Find Your Phone Tool :
మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుకోని పరిస్థితుల్లో మీ ఫోన్ మిస్ అయినట్లయితే వెతికి పట్టుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.
"https"తో ప్రారంభమయ్యే :
"https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు.
మీకు తెలియని వ్యక్తుల నుంచి :
మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి. వీటిలో కూడా వైరస్ పొంచి ఉండే ప్రమాదముంది.
టు స్టెప్ అథెంటికేషన్ ప్రాసెస్ :
మీ ఫోన్‌లోని ముఖ్యమైన డేటాకు టు స్టెప్ అథెంటికేషన్ ప్రాసెస్‌ను ఇంప్లిమెంట్ చేయండి. ఈ చర్య మీ ఫోన్ డేటాకు మరింత రక్షణగా నిలుస్తుంది. డేటాను యాక్సెస్ చేుసుకోవల్చిన ప్రతిసారి వెరిఫైడ్ ఫోన్ నెంబర్‌కు ఓ ప్రత్యేకమైన కోడ్ అందుతుంది. ఈ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే డేటా యాక్సెస్‌కు వీలుంటుంది
Labels:
Tech News
No comments:
Post a Comment