రాత్రుళ్లు ఇంటర్నెట్ బంద్!
ఇంటర్నెట్ వాడకం పై చైనా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వీడియో గేమ్స్ మత్తులో లీనమైపోయి గంటల తరబడి వీడియో గేమ్ సెంటర్లకే పరిమితమవుతోన్న పిల్లల అలవాట్లను మార్చేందుకు చైనా సర్కార్ సిద్ధమవుతోంది.
18 సంవత్సరాలలోపు పిల్లలు అర్థరాత్రి దాటిన తరువాత ఇంటర్నెట్ గేమింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకుంది.
ఓ స్పెషల్ డ్రైవ్ :
రెగ్యులేషన్స్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మైనర్స్ నెట్‌వర్క్ పేరుతో చేపడుతోన్న ఈ స్సెషల్ డ్రైవ్‌లో భాగంగా చిన్నారులు ఇంటర్నెట్ గేమింగ్‌కు భానిసలు కాకుండా చైనా సైబర్ స్పేస్ యంత్రాంగం చర్యలు తీసుకోబోతోంది.
చైనా ఇంటర్నెట్ యూజర్లలో :
చైనా ఇంటర్నెట్ యూజర్లలో 10 నుంచి 39 సంవత్సరాల వయస్సు మధ్యగల యూజర్ల సంఖ్య 74 శాతంగా ఉంది. వీరిలో 20 శాతం మంది యూజర్లు పదేళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సున్నవారు ఉన్నారు.
మార్పు తీసుకువచ్చేందుకు పునారావాస కేంద్రాలు :
ఇంటర్నెట్ గేమింగ్‌కు భానిసులగా మారిన పిల్లల్లో మార్పును తీసుకువచ్చేందకు వారని పునరావస కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ ఇప్పించేందుకు కూడా చైనా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అర్థరాత్రి దాటిన దగ్గర నుంచి :
అర్థరాత్రి దాటిన దగ్గర నుంచి ఉదయం 8 గంటల వరకు ఇంటర్నెట్ గేమింగ్ పై నిషేధం విధించాలని కూడా చైనా భావిస్తోంది. గేమింగ్ సెంటర్లలో పై పిల్లలు ఎక్కువ సేపు కూర్చోకుండా, నిర్ణీత సమయంలో మాత్రమే గేమ్స్ ఆడే విధంగా చర్యలు తీసుకుంటోంది.
ఐడీకార్డ్ సిస్టం :
ఇందుకుగాను ప్రత్యేకమైన ఐడీకార్డ్ సిస్టంను చైనా అందుబాటలోకి తీసకురాబోతోంది. చిన్నారులు గేమ్స్ ఆడే ముందు ఈ ఐడి కార్డ్ ద్వారా కంప్యూటర్ లోని లాగిన్ అవ్వాల్సి. నిర్ణీత సమయం పూర్తవగానే సిస్టం ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. వీళ్లు ఇక ఏ గేమింగ్ సెంటర్‌కు వెళ్లినా గేమ్ ఆడలేరు.
ప్రజల నుంచి వ్యతిరేకత :
చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెటిజనులు తమ నిరసనలను సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
Labels:
General Info
No comments:
Post a Comment