Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ...నవంబరు 7 లోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు

స్టాఫ్‌ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి)- వివిధ విభాగాల్లో ఉన్న 5134 పోస్టుల భర్తీకోసం భారీ నోటిఫికేషన విడుదల చేసింది. పోస్టల్‌ అసిస్టెంట్స్‌/ సోర్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 3281, ఎల్‌డిసి పోస్టులు 1321, డిఇఒ పోస్టులు 506 కాగా కోర్టు క్లర్క్‌ 26 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 2017 జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ దరఖాస్తుకు అర్హులు.


ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్‌ బేస్డ్‌ రిటెన ఎగ్జామినేషన, డిస్ర్కిప్టివ్‌ పేపర్‌, టైపింగ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నవంబరు 7 లోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌, ఏప్రిల్‌ 9న డిస్ర్కిప్టివ్‌ పేపర్‌ ఎగ్జామ్‌ జరుగుతాయి. 

పూర్తి వివరాల కోసం www.ssconline.nic.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.

No comments:

Post a Comment