Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న 256 జీబి మెమరీ కార్డ్........

EVO Plus పేరుతో శక్తివంతమైన 256జీబి మైక్రోఎస్డీ కార్డ్‌ను సామ్‌‍సంగ్ అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర 240.99 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం ఈ కార్డ్ ధర ఇంచుమించుగా రూ.16,730 వరకు ఉండొచ్చు). ఈ మెమరీ కార్డ్ సామర్థ్యాన్ని పరిశీలించినట్లయితే 12 గంటల నిడివి గల 4కే అల్ట్రా హైడెఫినిషన్ వీడియో లేదా 33 గంటల హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్‌ను స్టోర్ చేయగలదు.

సామ్‌సంగ్ V-NAND అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నఈ మెమరీ కార్డ్ రీడింగ్ స్పీడ్ సెకనుకు 95MBగా ఉండగా, రైటింగ్ స్పీడ్ సెకనుకు 90MBగా ఉండి. హై రిసల్యూషన్ ఫోటోగ్రఫీ కంటెంట్‌తో పాటు వర్చువల్ రియాల్టీ, గేమింగ్ వంటి గ్రాఫిక్ ఇంటెన్సివ్ మల్టీమీడియా కంటెంట్‌ను ఈ కార్డ్ స్టోర్ చేయగలదు. 10 సంవత్సరాల లిమిటెడ్ వారంటీతో వస్తోన్నఈ హై స్టోరేజ్ మెమరీ కార్డ్‌లను అమెరికా, చైనా, యూరోప్ ఇంకా ఇతర ప్రాంతాల్లో జూన్ 2016 నుంచి విక్రయించనున్నారు. లేటేస్ట్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో సిద్థంగా ఉన్న 5 శక్తింతమైన Sandisk స్టోరేజ్ డివైస్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

5 శక్తింతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్ : 
యాపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌లలోని డేటాను వేగంగా ఇంకా సలువుగా యాక్సిస్ చేసుకునేందుకు శాన్‌డిస్క్ ఐఎక్స్‌ప్యాండ్ ఫ్లాష్ డ్రైవ్ చక్కటి ఆప్షన్. 16జీబి వర్షన్ నుంచి 128జీబి వర్షన్ వరకు వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫ్లాష్ డ్రై‌వ్‌లు సిద్ధంగా ఉన్నాయి. సెక్యూర్ యాక్సిన్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఈ డ్రైవ్‌‌లోని డేటాకు మరింత సెక్యూరిటీని కల్పిస్తుంది. డ్రైవ్‌లోని డేటాకు పటిష్టమైన పాస్‌కోడ్ లేదా టచ్‌ఐడీని ఏర్పాటు చేసుకోవటం ద్వారా డేటాను వేరొకరు దొంగిలించలేరు. శాన్‌డిస్క్ ఐఎక్స్‌ప్యాండ్ ఫ్లాష్ డ్రైవ్ 16జీబి వర్షన్ ధర రూ.3,990.128జీబి వర్సన్ ధర 9,990.

5 శక్తింతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్ : 
శాన్‌డిస్క్ కనెక్ట్ వైర్‌లెస్ స్టిక్ ఇప్పుడు 200జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది. ఈ అప్ గ్రేడెడ్ వర్షన్ స్టోరేజ్ స్టిక్ ద్వారా డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. శాన్‌డిస్క్ కనెక్ట్ యాప్ సహాయంతో స్టిక్‌ను ఆండ్రాయిడ్, యాపిల్, గూగుల్ క్రోమ్‌కాస్ట్, అమెజాన్ ఫైర్ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు.

5 శక్తివంతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్:
 ఫోటోగ్రఫీ ప్రియులకు శాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ ప్రో మైక్రోఎస్డీ‌ఎక్స్‌‍సీ యూహెచ్ఎస్ - II కార్డ్ చక్కటి ఆప్షన్. ఈ కొత్త స్టోరేజ్ కార్డ్ 64 ఇంకా 128జీబి రియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కార్డ్ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ సెకనుకు 275ఎంబీగా ఉంది. షాక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఎక్స్-రే ప్రూఫ్. సాహసోపేత ఫోటోగ్రఫీ షూట్‌లలో పాల్గోనే వారికి ఈ కార్డ్ చక్కటి ఆప్షన్.




5 శక్తివంతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్ :  
హైస్సీడ్ డేటా స్టోరేజ్ అలానే డేటా ట్రాన్స్‌ఫర్‌ను కోరుకునే వారికి శాన్‌డిస్క్ అల్ట్రా డ్యుయల్ యూఎస్బీ డ్రైవ్ 3.0 బెస్ట్ ఆప్షన్. 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న ఈ డ్రైవ్, మీ ఆండ్రాయిడ్ డివైస్ లోని డేటాను భద్రంగా స్టోర్ చేస్తుంది.


5 శక్తివంతమైన Sandisk స్టోరేజ్ డ్రైవ్స్ :  
టైప్ సీ యూఎస్బీ కనెక్టువిటీ పోర్టుతో వస్తోన్న శాన్‌డిస్క్ అల్ట్రా డ్యుయల్ యూఎస్బీ టైప్ సీ ఫ్లాష్ డ్రైవ్ క్విక్ షేరింగ్ ఇంకా క్విక్ స్టోరేజ్ సామర్థ్యాలను కలిగి ఉంది.

No comments:

Post a Comment