ఫోన్‌తో మీ కంప్యూటర్‌ను Shutdown చేయటం ఎలా..?
అరచేతిలో అద్భుతాలను చూపెడుతోన్న స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అనేక కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ల గురించి అనే స్మార్ట్ ట్రిక్స్ మనం తెలుసుకున్నాం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌తో కంప్యూటర్‌ను Shutdown చేసే ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
స్టెప్ 1:
ముందుగా మీ విండోస్ పీసీలో Airytec switch off అనే ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
స్టెప్ 2 :
యాప్ పీసీలో ఇన్‌స్టాల్ అయిన వెంటనే సిస్టం ట్రేలో షట్‌డౌన్ ఐకాన్‌ను మీకు కనిపిస్తుంది.
స్టెప్ 3 :
షట్‌డౌన్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆప్షన్స్‌ను మీకు కావల్సిన విధంగా టిక్ చేసుకోండి.
స్టెప్ 4 :
మెనూలో కనిపించే shutdown icon పై రైట్ క్లిక్ చేసినట్లయితే, సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా remote section కనిపిస్తుంది. అప్పుడు, Edit Web interface Settings ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 5 :
Web interfaceను ఎనేబుల్ చేసుకుని apply బటన్ పపై క్లిక్ చేయండి.
స్టెప్ 6 :
ఇప్పుడు view / update static addresses పై క్లిక్ చేసినట్లయితే మీ పీసీకి సంబంధించి Shutdown URL కనిపిస్తుంది. ఈ URLను మీ స్మార్ట్‌ఫోన్‌లో బుక్‌మార్క్ చేయండి. టాస్క్‌ను ఎనేబుల్ చేసేందుకు సిస్టం ట్రేలోని shutdown icon పై డబల్ క్లిక్ ఇవ్వండి.
స్టెప్ 7 :
బుక్‌మార్క్ చేసుకున్న యూఆర్ఎల్‌ను మీ మొబైల్‌లో ఓపెన్ చేయండి. ఈ ఫోటోలో చూపించిన విధంగా ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది.
స్టెప్ 8 :
ఇంటర్‌ఫేస్‌లో కనిపించే shutdown బటన్ పై క్లిక్ చేసినట్లయితే కంప్యూటర్ ఆటోమెటికగా షట్‌డౌన్ అయిపోతుంది.
Labels:
Tech News
No comments:
Post a Comment