సామ్‌సంగ్ సర్వీస్ వ్యాన్...........గ్రామాల్లో సంచరిస్తూ సర్వీసు చేస్తాయి
తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను గ్రామీణ ప్రాంతాలకే సైతం విస్తరించుకునేందుకు సామ్‌సంగ్ ఇండియా సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 6,000 తాలుకాలకు చేరువయ్యే విధంగా 535 కొత్త సర్వీస్ వ్యాన్‌లను లాంచ్ చేసింది. ఇవి గ్రామాల్లో సంచరిస్తూ సామ్‌సాంగ్ యూజర్లకు మెరుగైన సర్వీసును ఆఫర్ చేస్తాయి.
నిపుణులైన ఇంజినీర్ల పర్యవేక్షణలో :
నిపుణులైన ఇంజినీర్లు ఈ వ్యాన్‌లలో అందుబాటులో ఉంటారు. కీలక కాంపోనెంట్స్‌తో పాటు సర్వీసింగ్ చేసేందుకు అవసరమైన అన్ని రకాల ఎక్విప్‌మెంట్ ఈ వ్యాన్‌లలో సిద్ధంగా ఉంటుంది.
250 సర్వీస్ పాయింట్స్ :
ఈ సర్వీస్ వ్యాన్‌లతో పాటు స్థానిక ఇంజినీర్లతో కూడిన 250 సర్వీస్ పాయింట్‌లను కూడా సామ్‌సంగ్ ఈ నెలలోనే ఏర్పాటు చేయనుంది.
1800-40-7267864 నెంబర్:
1800-40-7267864 నెంబర్‌కు కాల్ చేయటం ద్వారా సామ్‌సంగ్ సర్వీస్ వ్యాన్ ప్రతినిధులు మీకు అందుబాటులోకి వస్తారు.
1995 డిసెంబర్‌లో :
సామ్‌సంగ్, భారత్‌లో తన కార్యకలాపాలను 1995లో డిసెంబర్‌లో ప్రారంభించింది. ఈ 20 సంవత్సరాల కాలంలో రెండు తయారీ యూనిట్ లతో పాటు మూడు ఆర్‌అండ్‌బి సెంటర్స్ ఇంకా ఒక డిజైన్ సెంటర్‌ను సామ్‌సంగ్ భారత్‌లో నెలకొల్పగలిగింది. 40,000 మంది ఉద్యోగులు సామ్ సంగ్ లో పనిచేస్తున్నారు.
Labels:
Tech News
No comments:
Post a Comment