Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

మీరు వాహనాలపై బయటకు వెళ్లే తొందర్లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా!

ఇక మీదట బండి పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.లైసెన్స్ అవసరం లేదు అంటే తీస్కువెళ్ళే అవసరం లేదని అంతే…. మీరు వాహనాలపై బయటకు వెళ్లే తొందర్లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా! రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయా.. ఇక నుంచి నిశ్చింతగా ఉండండి. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. మీ వాహన, లైసెన్స్ చరిత్రలన్నీ అందులోనే లభిస్తాయి. ఈ మేరకు త్వరలోనే వాహనదారులకు సేవలను మరింత సులభతరం చేయడానికి రవాణాశాఖ కొత్త టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటుంది.


వాహనదారుల సౌలభ్యం కోసం డిజి లాకర్ అనే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం, ఈ పద్దతితో డిజి లాకర్ అనే అప్లికేషన్ ని తయారు చేసింది, ఈ అప్లికేషన్ లో మొబైల్ నెంబర్ ని ఇచ్చి లాగిన్ అవ్వాలి, ఆ తరువాత ఆధార్ నెంబర్ ఇచ్చి, డ్రైవింగ్ లైసెన్స్, బండి పేపర్లని స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి, డిజి లాకర్ లో అప్ లోడ్ చేయడం వల్ల మనం పేపర్లని డిజిటల్ రూపంలో డిజి లాకర్ లో భద్రంగా ఉంటాయి, ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ ఆపినప్పుడు మన దగ్గర బండి పేపర్లు లేకున్నా డిజి లాకర్ లో ఉన్న పేపర్లని చూపించవచ్చు, ఈ పద్దతిని తెలంగాణ ప్రభుత్వం 6 నెలల కిందటే M – Wallet పేరుతో ప్రవేశ పెట్టింది, ఇప్పుడు దేశం అంతటా డిజి లాకర్ తో ఈ పద్దతిని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

డిజి లాకర్ యూప్‌ను మొబైల్‌లోని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు రవాణా శాఖ అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. యూప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఆయా ధ్రువపత్రాలపై ఉన్నపేరు, సెల్‌ఫోన్‌లో నమోదు చేసిన వెంటనే వన్‌టైం పాస్‌వర్డ్(ఓపీటీ) వస్తుంది.దాన్ని నమోదు చేసిన వెంటనే ఆ పత్రం యొక్క జిరాక్స్ మొబైల్‌లో కన్పిస్తుంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఎన్ని పత్రాలైనా ఈ యూప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరుచుకునేందుకు వీలుంది. ఈ విధానంతో నకలీ పత్రాలకు కూడా కాలం చెల్లుతుంది.ఇకనేం ఇక హాయి హాయిగా ఏదీ మర్చిపోయాం అనే బెంగ లేకుండా రోడ్డెక్కొచ్చన్న మాట…! మరిన్ని వివరాలకి digilocker.gov.in వెబ్ సైట్ ని చుడండి.

No comments:

Post a Comment