సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి సి-35
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 26-09-2016 సోమవారం ఉదయం 9.12 గం లకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి -35 నింగిలోకి దూసుకెళ్లింది . ఈ వాహననౌక ఎనిమిది ఉపగ్రహాలను నింగి లోకి తీసుకెళ్లింది. ఇందులో ఇస్రో కు చెందిన స్కాట్ శాట్ -1, అల్జీరియాకు చెందిన మూడు , కెనడా, అమెరికా కు చెందిన ఒక్కొక్క ఉపగ్రహాలు ఉన్నాయి . వీటితో పాటు ముంబై ఐఐటీ కి చెందిన ప్రథమ్ , బెంగుళూరులోని పి.ఈ.ఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పి శాట్ ఉపగ్రహాలు ఉన్నాయి .
Labels:
Sullurupet
No comments:
Post a Comment