Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

వీటిక్కూడానా.... అని ఆలోచనలో పడిపోయారా...తెలుసుకోవాలంటే చదవండి

బెడ్రూమ్‌ :

Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes


దువ్వెనలు: 

వీటిని ప్రతి ఏడాది మార్చాల్సిందే. వారానికి ఒకసారి శుభ్రంగా కడుగుతున్నాం కదా అంటున్నారా. అయినప్పటికీ వాటిని మార్చాల్సిందే. 
స్లిప్పర్స్‌: ఇంట్లో వేసుకుని తిరిగే వీటికేం దుమ్ముపడుతుంది అనిపిస్తుంది. కాని వీటిని కూడా వాడడం మొదలుపెట్టి ఆరునెలలు అయ్యిందంటే చాలు మార్చడమో లేదా శుభ్రంగా కడగడమో చేయాలి. లేదంటే ఫంగ్‌సను వ్యాపింపచేసేందుకు ఇవి మంచి ప్లాట్‌ఫామ్‌ అవుతాయి. 
దిండ్లు: రెండు నుంచి మూడేళ్లకి ఒకసారి మార్చాలి. లేదంటే దుమ్ముధూళి, పురుగులు చేరిపోతాయి. అంతేకాదు ఎక్కువ రోజులు వాడడం వల్ల దిండు ఆకారం మారిపోయి మెడ నొప్పి వచ్చే ప్రమాదమూ ఉంది.

కిచెన్‌ :


మసాలాదినుసులు: వీటిని ఏడాది నుంచి మూడేళ్లలోపు మార్చాలి. ఉన్నాకొద్దీ వాటి వాసన, రుచి తగ్గిపోతుంది. పొడి కొట్టిన మసాలాకి ఆరు నెలలు వచ్చాయంటే వాడనేవాడొద్దు. 

పిండి: 
ఏ పిండినయినా ఆరు నెలల నుంచి ఏడాది పాటు వాడొచ్చు. ఫస్ట్‌గ్రేడ్‌ పిండి అయితే ఆరునెలలు, హైగ్రేడ్‌ పిండి అయితే ఏడాది పాటు వాడొచ్చంతే. 
ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లు: వీటికి కూడా ఎక్స్‌పైరీ డేటా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. కాని వీటి సామర్థ్యం కొంతమేరకే ఉంటుంది. ఆ సామర్థ్యం దాటాక వీటిని వాడితే ప్రమాదకరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకని చూసుకుని వాడండి.

చిల్డ్రన్‌ 
టీతర్‌: రెండు నుంచి ఐదు వారాల పాటు మాత్రమే వీటిని వాడాలి. టీతర్‌ను లేటెక్స్‌తో తయారుచేస్తారు. దాంతో వాడేకొద్దీ వీటిలో పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లలో సూక్ష్మక్రిములు వృద్ధిచెందుతాయి. బిడ్డకు అనారోగ్యాలను తెచ్చిపెడతాయి.

బాత్రూమ్‌ 


స్పాంజ్‌: రెండు వారాలకి ఒకసారి మార్చేయాలి. స్పాంజ్‌, షవర్‌ పఫ్స్‌ ఎంత ప్రమాదకరమైనవి అంటే వీటిలో రెండువారాలకి ఒకసారి ఫంగస్‌ వృద్ధి చెందుతుంది. అందుకనే వాటిని క్రమం తప్పకుండా మారుస్తుండాలి. మరీ రెండు వారాలకేనా అనేవాళ్లు వాటిని వేడినీళ్లలో మరిగిస్తే వాడొచ్చు. కాని ఆరోగ్యం విషయంలో రిస్క్‌ తీసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి. అందుకే వాటినీ మార్చేయాల్సిందే. 

తుండ్లు: వీటినయితే ఏడాది నుంచి మూడేళ్లలోపు మారిస్తే బెటర్‌. వారంలో రెండుమూడుసార్లు ఉతికినా మార్చకతప్పదు. రోజూ శుభ్రం చేసినా వాటిలో బ్యాక్టీరియా పెరగకుండా ఆపలేరు. అందుకని ఏడాది నుంచి మూడేళ్ల లోపు వాటిని తీసేసి కొత్తవి వాడటం ఆరోగ్యం.

No comments:

Post a Comment