Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

స్మార్ట్‌ఫోన్‌ వాడడం వల్ల తిప్పలు లేకుండా ఉండాలంటే.......

Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్‌ మీద మీ వేళ్లు తకదిమితోం అని అదేపనిగా ఆడిస్తున్నారనుకోండి వేళ్లు కందిపోయి మంటపుడతాయి. ఎక్కువమందిలో ఈ సమస్య కనిపిస్తుంది. చేతిమీద, మణికట్టు వద్ద గాంగ్లియన్‌ సిస్ట్‌లు లేదా లంప్‌లు ఏర్పడతాయి. వీటివల్ల భరించలేని నొప్పి ఉంటుంది. దాంతో వైద్య చికిత్స అవసరం పడుతుంది. ఇవి చాలవన్నట్టు ఫోన్‌ నుంచి విడుదలయ్యే వేడి వల్ల అరచేతిలో వేడి పుట్టి అరిచేతుల్లో మంటలు వస్తాయి. 

Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

అతిగా స్మార్ట్‌ఫోన్‌ వాడడం వల్ల చేతులు గట్టిగా అవ్వడమే కాకుండా ఎల్లప్పుడూ సన్నటి నొప్పి ఉంటుంది. ఈ నొప్పి వల్ల రోజూ వారీ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. స్మార్ట్‌ఫోన్‌ వాడడం వల్ల తిప్పలు లేకుండా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్‌ వాడకంలో 30 నిమిషాలకి ఒకసారి బ్రేక్‌ తీసుకోవాలి. అయినా నొప్పి తగ్గడం లేదంటే ఫోన్‌ని ఎంత తక్కువ వాడితే అంతమంచిది. ఈ జాగ్రత్తలతో పాటు చేతివేళ్లను కదిలించాలి. రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు మణికట్టు వ్యాయామాల వంటివి చేయాలి. ఇలా చేస్తే చేతివేళ్లకు కూడా ఉపశమనం కలుగుతుంది. 
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

ఇంట్లో చేయండిలా : 
1. చేతుల్ని ఒకసారి వేడి నీళ్లలో ముంచి తరువాత చల్లటి నీళ్లలో ముంచాలి. పెయిన్‌బామ్‌ రాసుకోవాలి (రుద్దకూడదు). చేతులకు సంబంధించి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మొబైల్‌ వాడకం మానేస్తే మంచిది. అదెలాగూ కుదరదు కాబట్టి వాడకం అయినా తగ్గించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గక, నొప్పి ఎక్కువగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. 
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

2. మౌస్‌ వంటి వాటిని వాడేవాళ్లు మణికట్టును మెత్తటి కుషన్‌ మీద ఉంచాలి. లాప్‌టాప్‌ వాడుతుంటే రిస్ట్‌ కంఫర్ట్‌ ప్యాడ్స్‌ను వాడాలి. 

3.  దేన్నయినా పట్టుకుని లాగే గ్రిప్‌ స్ర్టెంతనింగ్‌ వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల చేతులు, కీళ్లు సాగి వాటికి వ్యాయామం అందుతుంది.

No comments:

Post a Comment