ఆదరణ కోల్పోతున్న ఇంటర్నెట్‌లు...
2జీ నుంచి 4జీ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో కళాశాలకు వెళ్లే విద్యార్థుల నుంచి ఉద్యోగులతో పాటు వయోవృద్ధులు సైతం స్మార్ట్ ఫోనలను ఉపయోగిస్తూ తమకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లోనే పొందుతున్నారు. ఇంటర్నెట్‌లకు వెళ్లకుండానే తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన ద్వారానే వివిధ రకాల యాప్‌ల ద్వారా కావాల్సినటువంటి సకల సౌకర్యాలను మొబైల్ నుంచే పొందే సులభతరమైన అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఆదరణ కోల్పోతున్న ఇంటర్నెట్‌లు :
ఒకప్పుడు సాంకేతిక పరమైన విషయాలను తెలుసుకోవాలన్నా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని తెలుసుకోడానికి ఇంటర్నెట్ సెంటర్లను సంప్రదించేవారు. విద్యార్థులు పాఠశాలల్లో టీచర్లు ఇచ్చే అసైనమెంట్‌కు సంబంధించినటువంటి విషయాలను, ఫోటోలను డౌనలోడ్ చేసుకోడానికి నెట్‌కు వెళ్లేవారు. కొంత మంది పాటలు, సినిమాలు తిలకించడానికి గంటలు గంటలు నెట్ సెంటర్లలో గడిపేవారు. రైల్, విమాన సమయ పాలనలు తెలుసుకోవడానికి సైతం నెట్ సెంటర్‌లకి వెళ్లేవారు. దీంతో ఇంటర్నెట్‌సెంటర్లు ఉదయం నుంచి రాత్రి వరకు వినియోగదారులతో కళకళలాడేవి. ఇంటర్నెట్ వ్యాపారం సైతం మూడు పువ్వు లు, ఆరు కాయలుగా వర్ధిల్లేది. చాలామంది నిరుద్యోగులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని లక్షలాది రూపాయలను వెచ్చించి కంప్యూటర్లను కొనుగోలు చేసి ఇంటర్నెట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేవారు. అయితే ఒకప్పుడు వెలుగు వెలిగిన ఇంట ర్నెట్ సెంటర్లు వినియోగదారులు రాకపోవడంతో ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో వినియోగదారుల యజమానులు సైతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.
తగ్గిన ఇంటర్నెట్ కేఫ్‌లు :
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లాగా ఎక్కడపడితే అక్కడ ఇంటర్నెట్ కేఫ్‌లు ఒకప్పుడు కనిపించేవి. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం, యాప్రాల్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు నేడు పదుల సంఖ్యలోకి పడిపోయాయి. దీంతో ఇంటర్నెట్ సెంటర్ల వ్యాపారం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్స రాకముందు పెద్ద ఎత్తున ఇంటర్నెట్ సెంటర్లలో వ్యాపారాలు జరిగేవి. స్మార్ట్‌ఫోనలు అందుబాటులోకి రావడంతో పాటు వివిధ రకాల సెల్యూలర్ కంపెనీలు తక్కువ ధరకే అత్యాధునికమైన ఫాస్ట్‌తో కూడిన నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుండటంతో పెద్దగా ఎవరు నెట్ సెంటర్‌లోకి వెళ్లకుండానే తమకు కావాల్సిన సౌకర్యాలను అరచేతిలో ఇమిడి ఉండే సెల్ ద్వారా పొందుతున్నారు.
సమాచారంతో పాటు సినిమాల వరకు అన్ని సెల్‌లోనే :
ప్రజలు ప్రస్తుతం తమ స్మార్ట్ ఫోన ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విశేషాలతో పాటు క్రీడలు, సినిమాలు, పాటలు, రైల్, విమాన సమయ పాలనలు, మార్కెట్ ధరలను క్షణాల్లోనే సెల్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అంతే కాకుండా సెల్‌లో ఉన్న వివిధ రకాల యాప్‌ల ద్వారా నెట్ బ్యాంకింగ్, గ్యాస్ బుకింగ్, అమేజాన్, మంత్ర, వంటి యాప్‌ల ద్వారా తమకు కావాల్సినటు వస్తువులను ఆన్‌లైన్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. మరికొంత మంది వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు మందులను సైతం యాప్ ద్వారానే ఆర్డర్ ఇస్తున్నారు. దీంతో రోజురోజుకు స్మార్ట్ ఫోన్ లకు గిరాకీ పెరగగా ఇంటర్నెట్ సెంటర్లకు వ్యాపారం తగ్గిపోయింది.
సెల్ తోనే త్వరితగతిన పనులు :
స్మార్ట్ ఫోన్ లు వచ్చాకా పనులు చాలా వరకు సులభతరమయ్యా యి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను చేయడం, టెలిఫోన్ బిల్, పవర్ బిల్, నల్లాబిల్, ఆస్తి పన్నువంటివన్ని ఆనలైన ద్వారా మొబైల్ నుంచి నిర్వహిస్తాము. ఈజీ మూవీ ద్వారా సినిమా టికెట్‌లను సైతం బుక్ చేసే సౌకర్యం ఉంది. వివిధ రకాల హోటల్‌ల నుంచి కావాల్సిన ఆహారాన్ని స్మార్ట్ ఫోన నుంచే ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కేఫ్‌లోకి పోకుండానే స్మార్ట్ ఫోన ద్వారానే సకల సౌకర్యాలను పొందే వీలు పెరగడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది.
Labels:
Tech News
No comments:
Post a Comment