Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఏపీ నిరుద్యోగులకు త్వరలో తీపికబురు!

నెలాఖరులోగా గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్లు  1804 ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. 

నిరుద్యోగులకు నెలాఖరులోగా తీపికబురు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కీలకమైన గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా నోటిఫికేషన్ల ద్వారా 13 ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం 1,804 పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి సారించింది. ఇందులో 12 డిపార్ట్‌మెంట్లలోని 750 పోస్టులతో గ్రూప్‌-2, పంచాయత్‌రాజ్‌ కమిషనరేట్‌లోని 1,054 పంచాయతీ కార్యదర్శి (క్యారీ ఫార్వర్డ్‌తో కలిపి) పోస్టులతో గ్రూప్‌-3 నోటిఫికేషన్లు ఉన్నాయి. వయోపరిమితి సడలింపు పొడిగింపు, రోస్టర్‌ వారీ కటాఫ్‌ మార్కులకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలైన వారం రోజుల్లో ఈ రెండు ప్రకటనలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దసరాలోపే ఆ జీవోలు విడుదలయ్యే అవకాశం ఉంది. అత్యధిక సంఖ్యలో పోస్టులు ఉన్న ఈ రెండు కీలక నోటిఫికేషన్ల విడుదల ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే ఆలోచనలో ఏపీపీఎస్సీ ఉంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10 వేల ఉద్యోగాలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో 4,009 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 1,004 పోస్టుల భర్తీకి సంబంధించి 10 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంకా 3005 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో కీలకమైనవి గ్రూప్‌-2, గ్రూప్‌-3 నోటిఫికేషన్లు కావడంతో నిరుద్యోగుల మనోగతాలను, ఆతృతను పరిగణనలోకి తీసుకుని ఈ నెలలోనే వాటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందుకు భారీగా దరఖాస్తులు వస్తాయని భావిస్తున్న ఏపీపీఎస్సీ.. స్ర్కీనింగ్‌ టెస్ట్‌ దిశగా సమాయత్తమవుతోంది. 
గ్రూప్‌-2, 3 సర్వీసెస్ లోని పోస్టులు :
మున్సిపల్‌ కమిషనర్లు (గ్రేడ్‌-3) - 12, డిప్యూటీ తాసీల్దార్‌- 250, సబ్‌ రిజిస్టార్  (గ్రేడ్‌-2)- 27, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్స్‌- 90, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్స్‌- 8, సీనియర్‌ ఆడిటర్స్‌ - 35, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ - 16, సీనియర్‌ అకౌంటెంట్స్‌ - 180, జూనియర్‌ అకౌంటెంట్స్‌ - 35, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ - 97, పంచాయతీ కార్యదర్శి పోస్టులు- 1,054

No comments:

Post a Comment