పనితీరు కనబర్చిన ఎగ్జిక్యూటివ్‌లకు జీతాలను దాదాపు 15శాతం వరకు పెంచింది
టెలికాం సెక్టార్‌లో ఉన్న పోటీ వల్ల అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీ వీడి వెళుతుండటంతో రిలయన్స్ జియో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వారిని కాపాడుకునేందుకు కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి దసరా కానుకగా భారీగా వేతనాలను పెంచింది. ప్రతిభావంతులను కాపాడుకునే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది.
జియో ఆపరేషన్‌లో :
జియో ఆపరేషన్‌లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఎగ్జిక్యూటివ్‌లకు జీతాలను దాదాపు 15శాతం వరకు పెంచింది. జూనియర్, మధ్యశ్రేణి మేనేజర్లకు 15శాతం వరకు జీతం పెంచగా.. డీజీఎం ఆపై అధికారులకు 10శాతం వరకు జీతం పెంచింది.
దాదాపు అన్ని విభాగాలకు :
నెట్‌వర్క్, ఐటీ సపోర్ట్, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్, ప్రాజెక్టు, రెగ్యులేటరీ, హెచ్‌ఆర్ విభాగాలకు చెందిన వారికీ ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
ఉద్యోగుల హోదాను బట్టి :
ఉద్యోగుల హోదాను బట్టి జూనియర్లకు 7నుంచి 15శాతం, మధ్యశ్రేణిలో 5 నుంచి 10శాతం పెంచారు. టెలికం సెక్టార్‌లో తాము ఇచ్చిన ఇంక్రిమెంట్లు మరే కంపెనీ ఇవ్వలేదని జియో హెచ్‌ఆర్ కన్సల్టెంట్ తెలిపారు.
వార్షిక ఇంక్రిమెంట్ కింద :
వార్షిక ఇంక్రిమెంట్ కింద తమ జూనియర్, మిడిల్ స్థాయి ఉద్యోగులకు 7 శాతం నుంచి 15 శాతం వేతనాలను పెంచనున్నట్టు జియో గతేడాది చివర్లోనే ప్రకటించింది. పెరిగిన వేతనాలు ఏప్రిల్-మే నుంచి ఉద్యోగులకు అందుతాయని తెలిపింది.
పెంపు కొన్ని రోజులుగా వాయిదా:
కానీ ఆ పెంపు కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ వేతనాలను రిలయన్స్ జియో పెంచినట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉద్యోగులు అందుకుంటున్న వార్షిక ఇంక్రిమెంట్స్ ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా బాగున్నాయని ఓ ప్రముఖ హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ చెప్పింది.
సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే :
గతనెలలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టిస్తూ 4జీ సేవలను లాంచ్ చేసింది. కానీ ఆ సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే ఉన్నత స్థాయి ఉద్యోగులు కొంతమంది కంపెనీకి రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలకు సరియైన కారణాలు తెలియరాలేదు.
కంపెనీని వీడిన ఉన్నత ఉద్యోగులు :
Labels:
Tech News
No comments:
Post a Comment