ఈ-బ్యాంకింగ్....ఎం-బ్యాంకింగ్ ఉపయోగించడం తెలిస్తే ... మీకు నగదు అవసరం పెద్దగా ఉండదు ...
మొబైల్ బ్యాంకింగ్‌తో ఏం చేయొచ్చు తెలుసుకుందాం :
1. ఖాతాలో ఉన్న డబ్బును ఎవరికైనా పంపొచ్చు
2. ఖాతాలో ఉన్న సొమ్ము ఎంతో తెలుసుకోవచ్చు
3. మిని, డిటైల్డ్ స్టేట్‌మెంట్స్ తీసుకోవచ్చు
4. బిల్‌పేమెంట్స్, రిమైండ్స్ యాడ్ చేసుకోవచ్చు
5. మొబైల్ రీఛార్జ్స్ చేయోచ్చు..
6. యూపీఐ సేవలు వినియోగించొచ్చు
కావాల్సినవి :
స్మార్ట్ ఫోన్, నెట్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
ఈ-బ్యాంకింగ్‌కి.. ఎం-బ్యాంకింగ్‌కి తేడా :
ఈ-బ్యాంకింగ్ వినియోగించేవారు.. ఎం-బ్యాంకింగ్ ఎందుకు అనుకుంటారు.. కాని ఈ రెండికి చాలా తేడా ఉంది.. ఈ-బ్యాంకింగ్‌లో డబ్బులు పంపదలచుకున్న వ్యక్తి ఖాతా యాడ్ చేయకుండా డబ్బులు పంపలేం. ఎం-బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ఆ ఇబ్బంది ఉండదు. కేవలం ఖాతా నంబరు తెలిస్తే చాలు ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ తెలియకున్నా.. బెనిఫిషరీ యాడ్ చేయకున్నా నగదు బదిలీ చేసుకోవచ్చు.. కేవలం బ్యాంకు పేరు.. ఖాతా నంబరు తెలిస్తే సరిపోతుంది. ఇలాంటివి చాలా సర్వీలు ఎం బ్యాకింగ్‌లో అదనం.
యాప్ పొందడం ఎలా :
ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగించుకునేవారు ప్లేస్టోర్‌కి వెళ్లి సంబంధిత బ్యాంకు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. యాప్ పేరుతోపాటు అభివృద్ధి చేసిన సంస్థ పేరు కూడా సరిచూసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ పేరు కిందే ఆ వివరాలుంటాయి. వాటిని పరిశీలించి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఐ ఫోన్ వినియోగదారులు యాపిల్ స్టోర్‌లో యాప్‌ని వెతికి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
యాప్స్ ఏ పేరుతో ఉన్నాయి :
ప్లేస్టోర్‌లో ‘మొబైల్ బ్యాంకింగ్’ అని టైప్ చేస్లే అధికారిక.. అనధికార యాప్స్ మనకు కుప్పలుగా దర్శనమిస్తాయి.. మరి వాటిలో ఏది నిజమో.. ఏది కాదో తెలుసుకోవాలంటే కొంత పరిశీలిస్తే సరిపోతుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో పేరుతో యాప్స్‌ని విడుదల చేస్తుంటాయి.
ఎస్‌బీఐ యాప్ వాడాలంటే :
- ముందు ఆయా యాప్ స్టోర్స్‌కి వెళ్లి ‘స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్’ అని టైప్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేస్తే లాగిన్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్ అని వస్తుంది.. యూజర్ ఐడీ, ఎంపిన్ ఉంటేనే దాంట్లో లాగిన్ కాగలుగుతాం..
- కొత్తగా యాప్ వాడేవారు అడుగున రిజిస్టర్ అనే ఆప్ష్‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి
- ఆల్‌రెడీ యూజర్ ఐడీ ఉందా లేదా కొత్తది కావాలా అని అడుగుతుంది. దాంట్లో రెండో ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ(ఒన్‌టైం ఫాస్‌వర్డ్) పంపి ఖాతాని గుర్తింస్తుంది.
- వెంటనే మన మొబైల్‌కు యూజర్ ఐడీ, తాత్కలిక ఎంపిన్ వస్తుంది.
- వాటి సాయంతో లాగిన్ అయి.. తాత్కలిక ఎంపిన్ మార్చుకుని మనకు గుర్తుండేది పెట్టుకోవాలి.
- మొత్తం ఆరంకెల పిన్ అడుగుతుంది. దాంట్లో ఒక ఇంగ్లీష్ అక్షరం, ఒక అంకె, ఒక ప్రత్యేక గుర్తు(స్టార్, యాప్, ఎట్‌దిరైట్ వంటి స్పెషల్ కేరెక్టర్) తప్పని సరిగా ఉండాలి.. అప్పుడే అంగీకరిస్తుంది. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రకాలుగా యాక్టివేట్ చేయోచ్చు..
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా :
ఇప్పటికే ఈ-బ్యాంకింగ్ ఉన్నవారు ఎస్‌బీఐ పేజీలో లాగిన్ అయితే.. ఈ సర్వీసెస్ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎడమవైపు స్టేట్ బ్యాంకు ప్రీడమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన ఖాతా నంబరు ఇచ్చి సబ్మిట్ చేయాలి. అక్కడ మొబైల్ బ్యాంకింగ్‌లో ఇచ్చిన యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి ఓకే చేయాలి. అంతే మన రిజిస్టర్ మొబైల్‌కి యాక్టివేట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఈ రెండు పద్ధతులు కుదరకపోతే నేరుగా బ్యాంకుకు వెళ్లి అభ్యర్థన ఇస్తే చాలు వాళ్లు మన ఎం-బ్యాంకింగ్‌ని యాక్టివేట్ చేస్తారు.
యాడ్ చేయకుండా ఫండ్ పంపడమెలా :
ఎం-బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకున్న తరవాత యూజర్ ఐడీ, ఎం పిన్ సాయంతో ఫ్రీడమ్ యాప్‌లో లాగిన్ అవ్వాలి.. మెనూ లో ఐఎంపీఎస్ అకౌంట్ నంబరు అండ్ ఐఎ్‌ఫఎ్‌ససీ అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి.. అక్కడ క్లిక్ చేసి ఎవరికైతే డబ్బుపంపుతున్నామో వారి బ్యాంకు ఎంచుకోవాలి.. ఆ తరవాత ఎంత పంపాలో టైప్ చేయాలి.. సబ్మిట్ కొడితే మరోసారి సరిచూసుకోమని అడుగుతుంది.. దాన్ని ఓకే చేస్తే నేరుగా వారికి నగదు బదిలీ అయినట్లు మెసేజ్ చూపిస్తుంది.
యాక్టివేషన్‌కి ఏం చేయాలి :
బ్యాంకు ఖాతాకు మీ మొబైల్ నంబరు అనుసంధానం చేసుందో లేదో చూసుకోవాలి.. నగదు డ్రా చేసినా.. ఖాతాలో జమ చేసినా.. మొబైల్‌కి మెజెస్ వస్తుంటే ఇప్పటికే అనుసంధానమైనట్లు లెక్క. లేకుంటే ఏటీఎం కార్డు సాయంతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కుదరకుటే బ్యాంకుకు వెళ్తే సరి.
Labels:
General Info
No comments:
Post a Comment