డ్యుయల్ డిస్‌ప్లేతో ఎల్‌జీ ఫోన్ లాంచ్ అయ్యింది.....
LG V20 పేరుతో సరికొత్త డ్యుయల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ ఇండియా సోమవారం మార్కెట్లో లాంచ్ చేసింది. ఫోన్ ధర రూ.54,999. స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.
డ్యుయల్ డిస్‌ప్లే ఫీచర్ :
ఎల్‌జీ వీ20 ఫోన్‌లో ఏర్పాటు చేసిన డ్యుయల్ డిస్‌ప్లే ఫీచర్‌లో భాగంగా ప్రైమరీ డిస్‌ప్లే వచ్చేసరికి 5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సామర్థ్యంతో వస్తోంది (పిక్సల్ డెన్సిటీ 513 పీపీఐ). సెకండరీ వచ్చేసరికి 2.1 అంగుళాలు. "Always On" ఫీచర్‌తో వస్తోన్న ఈ డిస్‌ప్లే ద్వారా యాప్స్ లాంచ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ చూడొచ్చు, క్విక్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
డ్యుయల్ కెమెరా సెటప్ :
ఎల్‌జీ వీ20 కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంలో 16 ఎంపీతో పాటు 8 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది. 75 డిగ్రీ లెన్స్, 135 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, లేజర్ ఆటోఫోకస్, ఫేస్‌డిటెక్షన్ ఆటో ఫోకస్, కాంట్రాస్ ఆటోఫోకస్ వంటి ప్రత్యేకతలత కూడిన హైబ్రీడ్ ఆటోఫోకస్ సిస్టంను ఈ కెమెరాలలో చూడొచ్చు. స్మూత్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ కోసం క్వాల్కమ్ స్టెడీ రికార్డ్ 2.0 EIS టెక్నాలజీని ఈ కెమెరాలో పొందుపరిచారు. సెల్ఫీ అలానే వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ 120 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేసారు.
ఫోన్ హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి :
ఎల్‌జీ వీ20 ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 సాక్‌తో వస్తోంది. 4జీబి ర్యామ్ తో పాటు 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం. క్విక్‌ఛార్జ్ 3.0 టెక్నాలజీని సపోర్ట్ చేసే విధంగా 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో పొందుపరిచారు.
నౌగట్ ఆపరేటింగ్ సిస్టం :
ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఎల్‌జీ వీ20 ఫోన్ రన్ అవుతుంది.
32 బిట్ Hi-Fi Quad DAC :
మల్టీమీడియా ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ ఫోన్‌లో హైక్వాలిటీ ఆడియో ఇంకా వీడియో ఫీచర్లను పొందుపరచటం జరిగింది. మూడు ప్రత్యేకమైన మైక్రోఫోన్’లను ఈ ఫోన్‌లో చూడొచ్చు. 32 బిట్ Hi-Fi Quad DACను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయటం విశేషం.
Labels:
Gadgets
No comments:
Post a Comment