లెనోవో కే6 పవర్ ఆఫర్లు వింటే షాకవ్వాల్సిందే..
కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో లెనోవో ఆసక్తికర ఆఫర్లను అనౌన్స్ చేసింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా, లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.1499 విలువ చేసే మోటో పల్స్ 2 హెడ్‌ఫోన్‌లను కేవలం రూ.499కే సొంతం చేసుకోగలుగుతారు.
రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ : కండీషన్‌లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని లెనోవో కల్పిస్తోంది. ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశం ఉంది.
100 మంది లక్కీ విజేతలకు : ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే 100 మంది లక్కీ విజేతలకు రూ.10,000 ఎలక్ట్రానిక్ గిఫ్ట్ కూపన్లను లెనోవో అందించబోతోంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గోదలచిన వారు కే6 పవర్ మెనూలో 'Notify Me' ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది.
3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ : లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో, మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.9,999. డిసెంబర్ 6 నుంచి ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart, ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.
శక్తివంతమైన ప్రాసెసర్ : క్వాల్క్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి.
మెటల్ యునిబాడీ డిజైన్ : ఆకట్టుకునే ఫినిషింగ్‌కు తోడు పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.
లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్.
లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్ : ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం.
Labels:
Tech News
No comments:
Post a Comment