Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చో తెలుసుకోండి..

కంటెంట్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ Super Chat పేరుతో సరికత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా కంటెంట్ క్రియేటరర్స్ లైవ్ స్ట్రీమ్ ద్వారా తమ అభిమానులతో కనెక్ట్ అవ్వొచ్చు. తద్వారా డబ్బులు కూడా మీకు లభిస్తాయి. మీరు లైవ్ వీడియో స్ట్రీమర్ లేదా లైవ్ రివ్యూవర్ అయినట్లయితే, ఈ ఫీచర్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. బ్లాగర్స్ దగ్గర నుంచి గేమర్స్ ఇంకా సెలబ్రెటీస్ వరకు లైవ్ స్ట్రీమింగ్ ద్వారానే తమ సబ్‌స్ర్కైబర్‌లతో కనెక్ట్ కాగలుగుతున్నారు.
You-Tube-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

వాస్తవానికి, Super Chat అనేది పెయిడ్ ఇన్‌స్టెంట్ మెసేజ్ లాంటిది. ఈ ప్రోడక్ట్ ను లైవ్ స్ట్రీమ్ వ్యూవర్స్ కొనుగోలు చేసి ఆ డొనేషన్ ను బ్రాడ్‌కాస్టర్‌కు పంపాల్సి ఉంటుది. తద్వారా కంటెంట్ క్రియేటర్ కు డబ్బు సంపాదించుకునే మార్గం లభిస్తుంది. లైవ్ స్ట్రీమ్ వ్యూవర్స్ తన ఫేవరెట్ లైవ్ బ్రాడ్‌కాస్టర్‌కు డబ్బను డొనేట్ చేయటం ద్వారా క్రియోటర్ అటెన్షన్‌ను కూడా చొరగునే వీలుంటుది. జనవరి 31 నాటికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి సుకురానున్నట్లు యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజర్ బార్బరా మెక్ డోనల్డ్ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.
You-Tube-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించేందుకు మరిన్ని మార్గాలు :
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డబ్బులు సంపాదించేందుకు బోలెడన్ని ఆన్‌లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చేసాయి. వాటిలో యూట్యూబ్ ఒకటి. మీకు ఎక్కువ మంది ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే యూట్యూబ్ వీడియోల ద్వారా మీ సంపాదనను వేగవంతంగా పెంచుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా మీరు కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ గైడ్‌ఫాలో అవ్వండి...

ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి. ప్రతి యూట్యూబ్ అకౌంట్‌కు ఒక చానల్ అటాచ్ అయి ఉంటుంది. యూట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ లాంటిదే. మీరు యూట్యూబ్ అకౌంట్ ను క్రియేట్ చేయటం ద్వారా అన్ని గూగుల్ ప్రొడక్ట్స్‌లోకి మీకు యాక్సిస్ లభిస్తుంది.మీ యూట్యూబ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత మీ ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు ‘కీవర్డ్స్' (keywords)ను జత చేయండి. మీరిచ్చే keywords కంటెంట్‌కు సూట్ అయ్యేవిగా ఉండాలి.
You-Tube-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

మీ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా అదే సమయంలో సలువుగా గుర్తుంచుకునే విధంగా ఉండేలా చూసుకోండి.మీ యూట్యూబ్ అకౌంట్‌లో హైక్వాలిటీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయటం ప్రారంభించండి. మీరిచ్చే కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోల చిత్రీకరణలో భాగంగా క్వాలిటీ కెమెరాలను వాడండి. కంటెంట్‌కు హైక్వాలిటీ ఎడిటింగ్ ఇంటా టెక్నిక్‌లను జోడించి మీ ఆడియన్స్‌ను ఆకట్టుకోండి.

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయటం వల్ల మీ ఆడియన్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కంటెంట్ అప్‌లోడ్‌లో భాగంగా ఓ షెడ్యుల్‌ను ఫాలో అవ్వండి. వీడియోకు తగట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయండి. ఇదే సమయంలో ఆ వీడియోకు సంబంధించి ఆకట్టుకునే వివరణను వీడియో క్రింద పోస్ట్ చేయండి.మీ యూట్యూబ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించండి. మీ యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే క్రమంలో monetizationను ఏనేబుల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ వీడియాలలో యూట్యూబ్ వాణిజ్య ప్రకటనలను ప్లేస్ చేస్తుంది. ఇలా చేయాలంటే మీ వీడియోలలో ఏ విధమైన copyrighted కంటెంట్ ఉండకూడదు.
You-Tube-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ యూట్యూబ్ చానల్ అకౌంట్ పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ వయసు 18 సంవత్సరాలకు మించి ఉండాలి. అలానే వాడుకులో ఉన్న మెయిల్ అడ్రస్‌‌తో కూడిన పేపాల్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. యాడియన్స్ మీ వీడియోల పై ఏర్పాటు చేసిన యాడ్‌లసు క్లిక్ చేయటం ద్వారా లేదా చూడటం ద్వారా కొంత మొత్తం డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంటుంది.మీ ఛానెల్ మోనూలోని గూగుల్ ఆనాలిటిక్స్‌లోకి వెళ్లి మీ కంటెంట్ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫలితాలను మరింతగా మెరుగుపరుచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలను సెట్ చేసుకోండి.

మీ వీడియోలను కేవలం యూట్యూబ్‌లో మాత్రమే కాదు, బ్లాగ్ లేదా వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకుని అక్కడ కూడా మీ వీడియోలను పోస్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోండి.

No comments:

Post a Comment