Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

శ్రీ సిటీ సెజ్‌కు సమీపంలో ...వేలాది మందికి ఉపాధి అవకాశాలు

hero-compnay-planning-in-sri-city-sez-latest-updates-information-vedios-images


 చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దులోని శ్రీ సిటీ సెజ్‌కు సమీపంలో హీరో మోటార్‌ కార్ప్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ భూమిపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో కోర్టు ఆమోదంతో .. న్యాయపరమైన అవరోధాలు ఎదురుకాకుండా పరిశ్రమల శాఖ చర్యలు తీసుకుంది. ఈ భూమిలో గ్రామ దేవతగా కొలుస్తున్న కొన్ని చెట్లు ఉన్నాయి. గ్రామస్థులతో శాఖ అధికారులు చర్చలు జరిపారు. వారి సెంటిమెంట్‌ను గౌరవించి..గ్రామదేవత కోసం ఆలయాన్ని నిర్మించి ఇచ్చారు. ఇలా, భూవివాదాన్ని పరిష్కరించుకొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే హీరో మోటార్‌ కార్ప్‌.. ఈ భూములను రిజిసే్ట్రషన్‌ చేసుకునేందుకు రానున్నది.

అదే జరిగితే, రాష్ట్రంలోనే హీరో ద్విచక్ర వాహనాలు తయారవుతాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. భూముల రిజిసే్ట్రషన్‌ అంశం వచ్చే కేబినెట్‌లో ఆమోదం పొందే వీలుంది. ఇక.. మరో దిగ్గజ కార్ల తయారీ కంపెనీ కూడా అనంతపురం జిల్లాలో ప్లాంటును స్థాపించేందుకు సన్నద్ధమవుతోంది. హ్యుండాయ్‌ కార్ల తయారీలో ప్రముఖ స్థానం పొందిన కొరియాకు చెందిన ‘కియ’..రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. చెన్నైలో హ్యుండాయ్‌ కార్ల తయారీ యూనిట్‌ ఉంది. సంపూర్ణ సామర్థ్యంలో ఉత్పత్తి సాగిస్తుండటంతో.. ఆ ప్లాంటు విస్తరణకు వీలు లేదు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ‘కియ’ కంపెనీని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానం పలుకుతున్నాయి. అయినా, చెన్నైకి సమీపంలోనే ఉన్న అనంతపురం జిల్లాపై ‘కియ’ దృష్టి సారించింది. ఇప్పటి దాకా, కొరియాలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో ‘కియ’ యాజమాన్యం.. రాష్ట్రంలో ప్లాంటు పెట్టడంపై కాస్త మౌనం దాల్చింది. అంతకు ముందే .. అనంతపురం జిల్లాలో పర్యటించి ప్లాంటు స్థాపనకు అనువైన భూమిని పరిశీలించింది. ఎంవోయూ ప్రతులు ‘ కియ’కు చేరాయని, త్వరలోనే ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగనున్నాయని పరిశ్రమశాఖ వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment