పండే కదా…….అని చులకనగా చిన్న చూపు చూడకండి. అది మీ ప్రాణానికి రక్షణగా నిలుస్తుంది


రోజుకొక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని చాలా మంది చెబుతారు.అలాగే రోజుకు రెండు అరటి పండ్లు తింటే ఎన్నో వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు.ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ బారి నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.అరటి పండే కదా…….అని చులకనగా చిన్న చూపు చూడకండి. అది మీ ప్రాణానికి రక్షణగా నిలుస్తుంది.

టోక్యో యూనివర్సిటీ వారి పరిశోధనల ప్రకారం అరటి పండ్లలో ఉండే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లు క్యాన్సర్ కణాలతో సమర్థవంతంగా పోరాడి వాటిని నిర్మూలిస్తాయని తేలింది.అరటిపండు ఎంత పండితే క్యాన్సర్ నిరోధక గుణాలు అంతగా పెరుగుతాయి. అందులోనూ ఆకుపచ్చ అరటిపండ్ల కన్నా పసుపు పచ్చ రకం పండ్లలో పోషకాలు ఎనిమిది రెట్లు అధికంగా ఉంటాయి.

1. అరటిపండ్లలో పుష్కలంగా లభ్యమయ్యే బి6 , సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాలు వ్యాయామం చేయగల శక్తినిస్తాయి.
3. అరటి పండులో ఉండే త్రిప్టాన్లు అనే ప్రోటీన్లు మన మనసు ఆహ్లాదంగా ఉండేందుకు కూడా తోడ్పడతాయని పరిశోధకులు తేల్చారు.

No comments:

Post a Comment