ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు మరో శుభవార్త!
సచివాలయంలో కొలువుల భర్తీ విషయంలో ఏపీ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు వరంగా మారింది. సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో) పోస్టులను సగం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా.. సగం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేవారు. ప్రమోషన్ పోస్టులను టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టు నుంచి భర్తీ చేసేవారు. అయితే గత కొన్నేళ్లుగా టైపిస్ట్ నియామకాలు లేకపోవడంతో ప్రమోషన్ ద్వారా ఏఎ్‌సవో పోస్టుల భర్తీ నిలిచిపోయింది. సచివాలయంలో 370 సెక్షన్‌లు ఉన్నాయి. అంటే 740 మంది ఏఎస్‌వోలు ఉండాలి. కానీ, ప్రస్తుతం 320 మందే ఉన్నారు. సచివాలయంలో అత్యంత కీలకమైన బాధ్యత నిర్వహించే ఏఎస్‌వో పోస్టులు సగానికిపైగా ఖాళీగా ఉండడంతో ఇతరులపై పనిభారం పెరిగింది. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు ఏఎస్‌వో పోస్టులకు ప్రమోషన్ కోటాను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 75 శాతం ఏఎస్‌వో పోస్టులను నేరుగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికిప్పుడు భర్తీ చేపట్టినా 400కుపైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు. ఏఎ్‌సవో పోస్టులకు సాధారణ గ్రాడ్యుయేట్‌లు కూడా అర్హులే కావడంతో నిరుద్యోగులకు ఈ వెసులుబాటు వరప్రసాదం కానుంది.
Labels:
Job Notification
No comments:
Post a Comment