4జీ మొబైల్స్‌కు.....జియో ఊపుతో క్రేజ్ పెరిగింది
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. జియో ఊపుతో సెల్‌ఫోన్‌ల కొనుగోళ్లు అధికమయ్యాయు. అపరిమిత 4జీ నెట్‌వర్క్ ఆఫర్‌తో శరవేగమైన ఇంటర్నెట్, ఉచిత కాల్స్‌కు అవకాశం ఉండడంతో అన్ని రంగాలవారు జియోపై ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం 4జీ సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్‌లలో మాత్రమే జియో సిమ్ పనిచేస్తుండడంతో 4జీ మొబైల్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో అన్ని కంపెనీలు కూడా సరికొత్త మోడల్స్ విడుదల చేయడం, వరుసగా పండుగలు రావడంతో వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో నిత్యం 4జీ స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
మార్కెట్‌లో 4 జీ :
జిల్లాలో 4 జీ మొబైల్స్‌ను స్మార్ట్‌గా వాడేస్తున్నారు. జియో రాకతో 3జీ ఫోన్లవాడకానికి కాలం చెల్లింది. వినియోగదారులు 4జీ ఫోన్ల వైపే మొగ్గు చూపిస్తుండడంతో అన్ని మొబైల్ కంపెనీలు కూడా వివిధ రకాల మోడళ్లు, సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. చాలామంది కేవలం జియో సిమ్ కోసమే 4జీ మొబైల్స్ కొనుగోలు చేస్తుండడం విశేషం.
ఆకర్షిస్తున్న ఆఫర్లు :
పండుగలను పురస్కరించుకుని 4జీ మొబైల్స్ విక్రయాలు పెంచుకునేందుకు ఆయా కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటించాయి. కంపెనీ ఫోన్లు ఎమ్మార్పీ ధరకంటే తక్కువ ధరలకు ఇవ్వడంతోపాటు పలు స్కీమ్‌లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఉచితంగా జియోసిమ్, మెమోరీకార్డు, బ్లూటూత్, హెడ్‌సెట్‌లు, పవర్‌బ్యాంక్‌లు ఇలా పలు రకాల ఆఫర్లు అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
స్మార్ట్‌గా ధరలు :
గతంలో మొబైల్ కొనాలంటే జేబుకు చిల్లు పడేది. కేవలం ఉన్నత వర్గాలు, ఎగువ మధ్యతరగతి వారు మాత్రమే కొనుగోలు చేసేవారు. కానీ నేడు సెల్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతోపాటు 4జీ ఫోన్లు కూడా అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో ప్రతి ఒక్కరూ వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. నెల్లూరు జిల్లాలో రూ.3వేల నుంచి రూ.80 వేల విలువైన 4జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎవరి స్థాయిని బట్టి వారు ఈ హ్యాండ్‌సెట్లు కొనుగోలు చేస్తున్నారు.
Labels:
General Info
No comments:
Post a Comment