ఐఫోన్‌కు షాకిచ్చేలా... సోనీ Xperia XZ, ధర రూ.51,990
Xperia XZ పేరుతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను సోనీ కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.51,990. డిస్కౌంట్ పై రూ.49,990కి సొంతం చేసుకోవచ్చు.
యాపిల్ ఐఫోన్ 7తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తొలత IFA 2016లో ప్రదర్శించటం జరిగింది. హైలెట్ ఫీచర్లను పరిశీలించినట్లయితే...
ALKALEIDO మెటీరియల్‌తో :
సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ను ప్రత్యేకమైన ALKALEIDO మెటీరియల్‌తో తయారు చేసింది. ఫోన్ పై మచ్చలంటూ పడవు. 8.1 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బరువు 161 గ్రాములు.
X-Reality Engine :
సహజసిద్ధమైన రంగులను ఉత్పత్తి చేయగిలిగే అప్‌గ్రేడెడ్ X-Reality Engineను ఈ ఫోన్ డిస్‌ప్లేలో సోనీ పొందుపరిచింది. 5.1 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో.. లైవ్ కలర్ ఎల్ఈడి, లైవ్ కలర్ క్రియేషన్ వంటి రిచ్ టోన్ కలర్ ఫీచర్లను పొందుపరిచారు.
శక్తివంతమైన Snapdragon ప్రాసెసర్ :
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 820 chipsetను సోనీ నిక్షిప్తం చేసింది. పొందుపరిచిన అడ్రినో 530 చిప్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.
ర్యామ్ ఎంతంటే :
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్ 3జీబి ర్యామ్‌తో వస్తోంది. 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం.
సరికొత్త IMX300 Sensor :
సరికొత్త IMX300 Sensor ఆధారంగా పనిచేసే 23 మెగా పిక్సల్ కెమెరాను ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. 13 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది.
ట్రిపుల్ ఇమేజ్ సెన్సింగ్ :
సోనీ, తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్ కెమెరా ద్వారా ట్రిపుల్ ఇమేజ్ సెన్సింగ్ పేరుతో సరికొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సరికొత్త కమెరా టెక్నాలజీ కదులుతున్న వాటిని హైక్వాలిటీతో క్యాప్చుర్ చేస్తుంది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ స్థానంలో :
సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు బదులుగా SteadyShot Intelligent Active Modeను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోటోలు ఇంకా వీడియోలను స్థిరీకరించేందుకు ఈ మోడ్ 5 యాక్సిల్ గైరో స్కోప్‌ను ఉపయోగిస్తుంది.
4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. ఈ కెమెరా 4కే క్వాలిటీ వీడియోలను కూడా రికార్డ్ చేయగలదు.
వాటర్ రెసిస్టెంట్ తత్వం :
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్ ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెంట్ తత్వంతో వస్తోంది.
క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ :
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 2,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అడాప్టివ్ ఛార్జింగ్ టెక్నాలజీని డివైస్ సపోర్ట్ చేస్తుంది.
Labels:
Tech News
No comments:
Post a Comment