Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

మెంతులు ఉపయోగించడం వలన... ఎన్నో ప్రయోజనాలు ...


చర్మం మీద బొబ్బలు, గౌట్ నొప్పి, నరాల నొప్పి, ఒంటికాలి నొప్పి, దురదలు, గ్రంథుల వాపు, పుండ్లు, దెబ్బలపై – మెంతులను నీళ్లతో కలిపి ముద్దగా నూరి, అవసరమైన చోట పట్టుగా వేసుకోండి.

ఒక కప్పు మెంతి ఆకులను ఒక కోడిగుడ్డును కలిపి మెత్తగా ఉడికించండి. దీనికి ఒక కప్పు కొబ్బరి పాలు పేస్టులాగా మారేంతవరకూ వేడిచేయండి. దీనిని రోజుకు ఒకసారి చొప్పున రెండు మూడు రోజులు కడుపు లోపలకు తీసుకుంటే తుంటి నొప్పి తగ్గుతుంది.

రెండు టీ స్పూన్ల మెంతి గింజలను ఒక కప్పు బియ్యంతో, కొంచెం ఉప్పుతో కలిపి ఉడికించి తింటూ ఉంటే కొద్ది రోజుల్లోనే రక్తహీనత సమస్య దూరమవుతుంది. ఇలాగే మెంతి ఆకులతో కూర వండుకుని తింటే కూడా హితకరంగా ఉంటుంది.

ఒక టీ స్పూన్ మెంతులను ఒకటిన్నర కప్పుల నీళ్లకు వేసి మరిగించండి. తరువాత దించి చల్లార్చి రెండు టీ స్పూన్ల తేనె కలిపి తీసుకోండి. ఇలా కొంతకాలం పాటు రెండు పూటలా తీసుకుంటుంటే గుండె నొప్పి తగ్గుతుంది.

రెండు టీ స్పూన్ల మెంతులను అరకప్పు పాలకు కలిపి రెండు పూటలా ఆహారానికి ముందు తీసుకుంటే ఉంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. లేదా రాత్రిపూట రెండు టీస్పూన్ల మెంతులను ఒక కప్పు నీళ్లకు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం నానిన నీళ్లను తాగి, నానిన మెంతులను నేరుగా తినడం గాని లేదా కొద్దిగా తేనె కలిపి నమిలి తినడం గానీ చేస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

మెంతులను నానబెట్టి ఒక గుడ్డలో చుట్టి మొలకెత్తించండి. వీటిని ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటూ ఉంటే కాలేయం శక్తివంతమవుతుంది. అరుగుదల మెరుగవుతుంది.

మెంతి ఆకులను నీళ్లకు వేసి ఉడికించండి. తరువాత వెన్నతో వేయించండి. దీనిని రెండు పూటలా, పూటకు టేబుల్ స్పూన్ మోతాదుగా తింటూ ఉంటే ఎసిడిటీ, ఆమాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

రెండు టీ స్పూన్ల తాజా మెంతి ఆకులను ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే తలతిరగటం, తలనొప్పి, నిద్ర రాకపోవటం ఈ సమస్యలు తగ్గుతాయి.

ఒక కప్పు మెంతి ఆకులను నీళ్లకు వేసి మరిగించి తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే మలబద్దకం, పేగుల్లో అల్సర్లు, కంటిచూపు తగ్గటం, అర్శమొలలు వంటి సమస్యలు తగ్గుతాయి.

రెండు టేబుల్ స్పూన్ల మెంతి ఆకులను నీళ్లకు వేసి ఉడికించి అరకప్పు పెసరపప్పుతో, పది ఉల్లిపాయలతో కలిపి తింటూ ఉంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే దగ్గు, పూత, అర్శమొలలు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

రెండు టీ స్పూన్ల మెంతులను కొబ్బరి నీళ్లలోగాని లేదా మజ్జిగలో కాని మూడు గంటలు నానబెట్టి, నీళ్లను వడపోసుకొని తాగితే జిగట విరేచనాలు తగ్గుతాయి. అలాగే మెంతులను వేయించి, పొడిచేసి నీళ్లతో కలిపి తీసుకున్నా జిగట విరేచనాలు తగ్గుతాయి.

ఒక టీ స్పూన్ మెంతుల పొడిని పాలతో గాని మజ్జిగతో గాని రోజుకి రెండుసార్లు పదిహేను రోజులు తీసుకుంటే పొట్టనొప్పి, ఆమాశయంలో మంట తగ్గుతాయి.

ఒక టీ స్పూన్ మెంతులను వేయించి, పొడిచేసి, నీళ్లకు కలిపి తాగితే పొట్ట నొప్పి, కడుపులో గడబిడ, నులిపురుగులు, నోటిపూత వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా రోజుకి రెండుసార్లు, మూడు నాలుగు రోజులు చేయండి.

మెంతుల్ని, ఆవాలను, ఇంగువను, పసుపును అన్నిటినీ సమంగా తీసుకొని నెయ్యిలో వేయించి పొడిచేసి నిల్వ చేసుకోండి. దీనిని మూడు నుంచి నాలుగు టీస్పూన్లు మోతాదుగా, బియ్యం కడుగు నీళ్లతోగాని లేదా వరి అన్నంతోగాని వారం పాటు తింటే పొట్టనొప్పి, కాలేయ సమస్యలు తగ్గుతాయి.

No comments:

Post a Comment