Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

కాప్సికమ్‌ చికెన్‌ - How to Make Capsicum Chicken...

Indian-Andhra-traditional-telugu-recipe-south-indian-telugu-recipes-rice-recipes-pickles-sweets-and-Indian-Recipes-how-to-make-Information-images


కావలసిన పదార్థాలు: బోన్‌ లెస్‌ చికెన్‌ - అరకేజీ, క్యాప్సికం - 2, పెరుగు - అర కప్పు, పసుపు - పావు టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కారం - 1 టీ స్పూను, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర తరుగు - అరకప్పు, మసాలా పొడి - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.

తయారుచేసే విధానం: ఒక పాత్రలో చికెన్‌, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి గంటసేపు పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లి తరుగు దోరగా వేగాక చికెన్‌ మిశ్రమం వేసి సన్నని మంటపై ఉడికించాలి. చికెన్‌ మెత్తబడ్డాక (పొడుగ్గా తరిగిన) క్యాప్సికం ముక్కల్ని వేసి కలపాలి. పది నిమిషాల తర్వాత మసాలాపొడి, కొత్తిమీర చల్లి దించేయాలి. ఇది అన్నంలోకి, పరాటాల్లోకి బాగుంటుంది.

No comments:

Post a Comment