104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా చేర్చి...ఇస్రో చరిత్ర సృష్టించింది

Isro-pslv-c37-successful-latest-news-on-sriharikota-satelite-vedios-images

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. ఒకే సారి 1378 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా చేర్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. కాగా, ఇందులో భారత్ 3, అమెరికా 96, నెదర్లాండ్, కజకిస్తాన్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, యూఏఈ దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి.

ప్రపంచ రికార్డు భారత్ సొంతం :
అంతరిక్ష చరిత్రలోనే భారత్ అరుదైన రికార్డు సృష్టించింది. అమెరికా, రష్యాలను కూడా ఆశ్యర్యపరుస్తూ.. వెలుగులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ37 ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఇంతకుముందు 2014లో  రష్యా ఒకే సారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది.  

అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని :
ఒకే సారి 104 ఉపగ్రహాలను కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మరోసారి దేశం గర్వించేవిధంగా చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశం మొత్తం శాస్త్రవేత్తలకు వందనం చేస్తోందన్నారు.

No comments:

Post a Comment