ఇంటర్ ఉత్తీర్ణులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం
మరీ ముఖ్యంగా ఏడో వేతన సంఘం సిఫార్సులతో కొత్తగా ఉద్యోగంలో చేరే వారి కనీస వేతనం నెలకు రూ.22,000 నుంచి రూ.26,000 ఉంటుంది. ఇందుకు ఉద్దేశించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
(ఎస్ ఎస్ సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు ఎలా ప్రిపేర్ కావచ్చో చూద్దాం.
ఉద్యోగాలు: పోస్టల్ డిపార్టుమెంటులో పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, కోర్ట్ క్లర్క్ పోస్ట్‌లు
టైర్ 1 పరీక్ష: గతంలో టైర్ 1 పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో) ఉండేది. ఆ తరవాత స్కిల్ టెస్ట్ ఉండేది. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఇప్పుడు కూడా టైర్ 1 పరీక్షలో 200 మార్కులు కేటాయించారు. దీనిలో 4 టెస్ట్‌లు ఉంటాయి. వరుసగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్), జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రతి టెస్ట్‌కి 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నల సంఖ్య 100. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మినహా మిగతా ప్రశ్నలు ఇంగ్లీ్‌షకు తోడు హిందీలో కూడా అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. తప్పుగా గుర్తిస్తే 0.5 మార్కు కట్ చేస్తారు.
టైర్ 2 పరీక్ష: అలాగే 2016 ఆగస్టు 11న నోటిఫికేషన్ ప్రకారం ఈ సంవత్సరం నుంచి టైర్-2 కూడా పెట్టి, డిస్ర్కిప్టివ్ తరహా, పెన్ అండ్ పేపర్ పద్థతిలో నిర్వహిస్తున్నారు. దీనికి కూడా 100 మార్కులు కేటాయించారు. పరీక్ష కాల వ్యవధి ఒక గంట. దీనిలో 200 నుండి 250 పదాలలో ఒక వ్యాస రచన ఉంటుంది. లెటర్/అప్లికేషన్ రైటింగ్ ఉంటుంది. లెటర్/ అప్లికేషన్ రైటింగ్ 150-200 పదాలలో రాయాలి. దీనిలో కనీస క్వాలిఫైయింగ్ మార్కులు 33. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి కావాల్సిన రైటింగ్ స్కిల్స్‌ను ఈ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. అభ్యర్థులు ఈ పరీక్షను ఇంగ్లీ్‌షలో గాని , హిందీలో గాని రాయవచ్చు.
టైర్ 3 పరీక్ష: ఇందులో స్కిల్ టెస్ట్ ఉంటుంది.
1) డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు
2) పిఎ / ఎస్‌ఎ, లోయర్ డివిజన్ క్లర్క్ , కోర్టు క్లర్కులకు లకు టైపింగ్ టెస్ట్ పెడతారు.
పరీక్ష కాల వ్యవధి : 10 నిమిషాలు
Labels:
Job Notification
No comments:
Post a Comment